ప్యాకేజీతో ఒరిగేదేముంది

ప్యాకేజీతో ఒరిగేదేముంది - Sakshi


- ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి

- ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

- బంద్ పోస్టర్లు విడుదల

కోసిగి:
ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని, ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన బంద్‌కు సంబంధించిన పోస్టర్లను గురువారం ఆయన కోసిగిలో కార్యకర్తలు, వామపక్షాల పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీతో సంతృప్తి చెందేలా ఉన్నారని, కేంద్రప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉందన్నారు. అయితే దాని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా నాయకులు, ప్రజలు ఉద్యమాలకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.



శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో చేపట్టే రాష్ర్ట వ్యాప్త బంద్‌ను విద్యార్థి సంఘాలు, వామ పక్షాల పార్టీ నాయకులు, కార్మిక సంఘాలు, వ్యాపారస్తులు, మహిళా సంఘాలు కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బాబు వస్తే జాబు వస్తుందని టీడీపీ నాయకులు ఎన్నికల ముందు ప్రచారం చేశారని, అయితే ఇందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను తొలగిస్తోందన్నారు. ఐకేపీ వీబీకేలు, ఆదర్శ రైతులు, డీలర్లు, ఫీల్డుఅసిస్టెంట్లపై వేటు వేస్తూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ రెడ్డి, మండల ఇన్‌చార్జ్ నాయకులు రాంపురం మురళీరెడ్డి, ఎంపీపీ నాడుగేని భీమక్క, జెడ్పీటీసీ సభ్యులు మంగమ్మ, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు మహాంతేష్ స్వామి, నాయకులు పాల్గొన్నారు.

 

బంద్ నుంచి మంత్రాలయం, కౌతాళంకు మినహాయింపు :

మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధానోత్సవాలు, కౌతాళంలో ఖాదర్ లింగా స్వామి ఉరుసు ఉత్సవాలు, ఉరుకుందలో శ్రీ నరసింహా స్వామి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల29న బంద్‌ను మినహాయింపు ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top