ఏడాది దాటినా..ఒక్కగూడూ లేదు


బోట్‌క్లబ్ (కాకినాడ) : అధికారంలోకి వచ్చి ఏడాదిపైనే అయినా తెలుగుదేశం సర్కారు.. జిల్లాలో నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. దరఖాస్తులు చేసుకొని నెలలు  గడుస్తున్న మంజూరును గాలికొదిలేసింది. గత జనవరి, జూలై నెలల్లో నిర్వహించిన  జన్మభూమి సభల్లో జిల్లాలో 50 వేల మంది ఇళ్లు కావాలని  దరఖాస్తులు చేసుకొన్నప్పటికీ ఒక్కరికి కూడా  మంజూరు చేయలేదు. ప్రజాప్రతినిధులు హడావుడి చేయడం తప్ప తమకు చారెడు నీడ సమకూరడం లేదని ప్రజలు వాపోతున్నారు.    ఇక 2014-15  నిర్మించిన ఇళ్లకూ బిల్లులు మంజూరు చేయకపోవడంతో లబ్దిదారులు అనేక అవస్థలు పడుతున్నారు.  

 

 గత ఏడాది జిల్లాలో కేవలం 6,179 ఇళ్లు మంజూరు చేయగా, నిధులు విడుదల కాకపోవడంతో వివిధ దశల్లో నిలిచిపోయాయి. వాటిలో కొన్ని  పూర్తరుునప్పటికీ నేటికీ బిల్లులు మంజూరు చేయలేదు. అప్పులు తెచ్చుకొని ఇళ్లు పూర్తి చేసుకుని, బిల్లు వచ్చిన తర్వాత తీరుద్దామని ఎదురుచూపులు చూస్తున్న వారికి  వడ్డీలు పెరుగుతున్నాయి తప్ప బిల్లులు రావడం లేదు. ఒకసారి బ్యాంక్ అకౌంట్  నెంబర్ కావాలని, మరొకసారి ఆధార్‌కార్డు ఇవ్వాలని అంటూ బిల్లుల చెల్లింపు నిలిపివేశారు. దీంతో జిల్లాలో  4,874  ఇళ్లు పూర్తి కావచ్చినా ఇప్పటికీ పూర్తిగా బిల్లులు మంజూరు చేయలేదు. 982 శ్లాబ్ స్థారుులో నిలిచిపోయాయి. మూడు దశల్లో బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇల్లు పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. నివసించే పూరిపాకలు, శిథిలస్థితిలో ఉన్న ఇళ్లను కూలగొట్టుకొని  ప్రస్తుతం అవస్థలు పడుతున్నామని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం గృహనిర్మాణశాఖ అధికారుల చుట్టూ తిరుగుతుంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే బిల్లులు చెల్లిస్తామంటున్న సమాధానాలకు చేసేది లేక నిస్సహాయంగా నిట్టూరుస్తున్నారు.

 

 ముందు బిల్లులు చెల్లించండి..

 కాగా శుక్రవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణరుుంచారు. ఏర్పాటై సంవత్సరం పైబడినా ఇప్పటికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేని ప్రభుత్వం ప్రస్తుతం ఈ ప్రకటన అరుునా చేసింది.  అరుుతే ఈ నిర్ణయం అమలుకు ముందు.. గతంలో మంజూరై నిర్మాణం పూర్తరుున, వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు చెల్లించాల్సిన బిల్లులను చెల్లించడం అత్యవసరం.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top