రక్తమో...రామచంద్రా..!

రక్తమో...రామచంద్రా..! - Sakshi


విజయనగరం ఫోర్ట్‌:  ఇది ఈ ఇద్దరి రోగుల పరిస్థితే కాదు. అనేక మంది రోగులు నిత్యం ఎదుర్కొంటున్న పరిస్థితి.  కొద్ది  నెలలుగా బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిల్వలు  నిండుకున్నాయి. దీంతో రోగులు రక్తమో.. రామచంద్రా... అని రక్తం కోసం పడరాని పాట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది. జూలై నెలలో రక్తం కొరత ఏర్పడడం ఇదే తొలిసారని రక్తనిధి కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎంతో మంది రోగులు రక్తం దొరక్క ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్, రక్తహీనత, క్షతగాత్రులకు, గర్భిణులకు, శస్త్రచికిత్సలు అవసరమైన రోగులకు ఎక్కువుగా రక్తం అవసరం  పడుతుంది. జిల్లాలో కేంద్రాస్పత్రిలో ఒకటి, పార్వతీపురంలో రెడ్‌సోసైటీ ఆధ్వర్యంలో ఒకటి, విజయనరం కలెక్టరేట్‌ జంక్షన్‌లో రెడ్‌క్రాస్‌ సోసైటీ ఒకటి, నెల్లిమర్ల మిమ్స్‌ ఆస్పత్రిలో ఒక బ్లడ్‌ బ్యాంక్‌ ఉన్నాయి.  పట్టణంలోని  బాలాజీ మార్కెట్‌ వద్ద ప్రైవేటుకు చెందిన పట్నాయక్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఉంది



నాలుగు బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్లు

జిల్లాలో సాలూరు, చీపురుపల్లి, ఎస్‌.కోట, బొబ్బిలి సామాజిక ఆస్పత్రుల్లో బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్లు ఉన్నాయి. అయితే బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్లు ఉత్సవ విగ్రహల్లా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్లలో రక్త నిల్వల కొరత తరుచు ఏర్పడుతుందనే సమాచారం. దీంతో బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్లు ఉన్నా రోగులకు పెద్దగా ప్రయోజనం  లేదనే విమర్శలున్నాయి.



అన్ని గ్రూపుల రక్తం కొరతే...

సాధారణంగా నెగిటివ్‌ గ్రూపుల కొరత ఎక్కువుగా ఉంటుంది. కానీ ఈసారి పాజిటివ్, నెగిటివ్‌ రెండు గ్రూపుల రక్తం కూడ దొరకని పరిస్థితి. బ్లడ్‌బ్యాంక్‌ల్లోను, బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్‌ల్లోను రక్తం నిండుకుండడంతో రోగుల బంధువులు దిక్కుతోచని స్థితిలో కొ ట్టుమిట్టాడుతున్నా రు. కొంతమంది రోగులు బంధువులు పక్క జిల్లా అయిన విశాఖ జి ల్లాకు పరుగులు తీస్తున్నారు.



రక్తాన్ని సేకరించలేని పరిస్థితి

జిల్లాలో ఐదు రక్తనిధి కేంద్రాలు ఉన్నప్పటికి రోగులకు పూర్తి స్థాయిలో రక్తాన్ని సేకరించలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  రోగులకు అవసరమయ్యే రక్తాన్ని ఉచితంగా అందించాల్సి ఉన్న రీప్లేమెంట్‌పైనే బ్లడ్‌బ్యాంక్‌లు ణాధారపడుతున్నాయి. రక్తం అవసరమయ్యే రోగులు రక్తం దానం ఇస్తేగాని రక్తం ఇవ్వని పరిస్థితి.



వాయిదా పడుతున్న శస్త్రచికిత్సలు

రక్తం సకాలంలో దొరక్కపోవడంతో రోగులకు శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి.  ముఖ్యంగా గర్భిణులకు శస్త్రచికిత్సలు చేసే సమయంలో రక్తం లభించక అవస్థలు పడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top