నీటి బొట్టు.. దొరికితే ఒటు


కర్నూలు(అర్బన్): వ్యవసాయ బావులు.. బోర్లవద్ద ప్రజలు క్యూకడుతున్నారు. చెలమ నీటికోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.వారం రోజులకోసారి వచ్చే నీటి కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పల్లెలతో పాటు పట్టణాల్లోనూ తాగునీటిసమస్య తీవ్రరూపం దాలుస్తోంది. రక్షితమంచినీటిని అందించాల్సిన  సీపీడబ్ల్యు స్కీంలలో నీరు అడుగంటుతోంది. ఇప్పటికే 12 పథకాల్లో నీటిజాడ కానరాకపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. వీటి పరిధిలోని 144 గ్రామాల ప్రజల గొంతెండుతోంది. గోనెగండ్ల, పగిడ్యాల మండలాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆదోని డివిజన్‌లోనిఎల్లార్తి రక్షిత మంచినీటి పథకం ద్వారాఎల్లార్తితో పాటు మరో ఐదు గ్రామాలకు నీరందించాల్సి ఉండగా నీటిజాడ కరువైంది.

 

  ఇదే డివిజన్‌లోని పెద్దతుంబళం, రౌడూరు, ఉప్పరహాల్,చిన్నహరివాణం, సంతెకుడ్లూరు, బసాపురం, పెద్దహరివాణం, గంజిహళ్లి పీడబ్ల్యుఎస్.. నంద్యాల డివిజన్‌లోనికొండుపల్లి, రూపనగుడి, బుక్కాపురంసీపీడబ్ల్యు పథకాల్లో.. కర్నూలుడివిజన్‌లోని పగిడ్యాల, బన్నూరు,మిడ్తూరు సీపీడబ్ల్యు స్కీంలలోనూనీరు పూర్తిగా అడుగంటింది.

 

 ఈ నేపథ్యంలో ప్రజల నీటి ఇక్కట్లు వర్ణనాతీతం.అడుగంటిన రక్షిత మంచినీటి పథకాలుఎల్లార్తి, విరుపాపురం, గోనెగండ్ల,చింతకుంట, బాపురం, పత్తికొండ,కొండుపల్లి, రూపనగుడి, బుక్కాపురం, పగిడ్యాల, బన్నూరు, మిడ్తూరుసీపీడబ్ల్యు స్కీంల ద్వారా దాదాపు 144గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించాల్సి ఉంది. అయితే ఆయా నీటి పథకాలకు సంబంధించిన ఎస్‌ఎస్‌ట్యాంకుల్లో నీరు పూర్తిగా అడుగంటింది.



 ఈ పరిస్థితుల్లో నీటి సరఫరాకష్టసాధ్యంగా మారింది. పత్తికొండనియోజకవర్గంలోని 29 గ్రామాలకుమంచినీటిని అందిస్తున్న బండగట్టునీటి పథకంలోనూ నీరు అట్టడుగుకుచేరుకోవడంతో ఆయా గ్రామాల్లోప్రజలు తాగునీటి అవస్థలు ఎదుర్కొంటున్నారు.

 

 ఆలూరు నియోజకవర్గంలో 27 గ్రామాల దాహం తీర్చాల్సిన బాపురం రిజర్వాయర్‌లో నీరుఅడుగంటడం ఆందోళన కలిగిస్తోంది.వర్షాలు కురవకపోవడంతో నీటి పథకాలపై ఆధారపడిన గ్రామాల్లో ప్రజలుదాహంతో అలమటిస్తున్నారు.వాహనాలతో నీటి సరఫరాజిల్లాలో పూర్తి తాగునీటి ఎద్దడినెలకొన్న 47 గ్రామాలకు వాహనాలద్వారా నీరు సరఫరా చేస్తున్నారు.కర్నూలు డివిజన్‌లోని 19, ఆదోనిడివిజన్‌లోని 11, నంద్యాల డివిజన్‌లోని 17 గ్రామాల్లో ఈ పరిస్థితినెలకొంది. కర్నూలు డివిజన్‌లోని 7,ఆదోని డివిజన్‌లోని రెండు గ్రామాల్లోసమీపంలోని బోర్లను ఆద్దెకు తీసుకొనిదాహం తీరుస్తున్నారు.



 12 మంచినీటి పథకాల్లో అడుగంటిన నీరు

 వరుణుడి జాడ కరువైంది. కారు మేఘం వర్షించనంటోంది. వాతావరణం ఆశ రేపుతున్నా.. చివరకు నిరాశేమిగులుతోంది. అదిగో.. ఇదిగో అనుకోవడమే తప్పిస్తేచుట్టపుచూపు చినుకే దిక్కవుతోంది. అరకొర పదునులో వేసిన పంటలు వాడుముఖం పట్టగా.. గ్రామాల్లోనీటి సమస్య జటిలమైంది. కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తేకానీ దాహం తీరని పరిస్థితి నెలకొంది.

 

 బిందెడు నీటికి పడరాని పాట్లుకోట్లాది రూపాయల వ్యయంతోనిర్మించిన బండగట్టు పథకంవృథాగా మారింది. వర్షాకాలంలోనూనీటి తిప్పలే. బిందెడు నీటి కోసం సైకిళ్లు వేసుకుని కిలోమీటర్ల దూరం వ్యవసాయ బోర్లనుఆశ్రయించాల్సి వస్తోంది. తోటల్లోకి రైతులురానివ్వడం లేదు. నాయకులు, అధికారులహామీలు మాటలకే పరిమితం.  - నాగరాజు, పత్తికొండ

 

 

 బండగట్టు నీళ్లు అందడం లేదుమంచినీటి కొరతతీరుస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణలోవిఫలమయ్యారు.బండగట్టు నీళ్లు సరఫరా కాకపోవడంతో బిందెడు నీటి కోసం అవస్థలు ఎదుర్కొంటున్నాం. ఎప్పుడొస్తాయో తెలియని నీటి కోసంరాత్రంతా జాగరణ చేయాల్సివస్తోంది. మా కష్టాలు ఎప్పుడుతీరుతాయో ఆ దేవునికే ఎరుక. - రేణుకమ్మ, పత్తికొండ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top