జిల్లాపై ఎందుకంత నిర్లక్ష్యం


పలాస: తెలుగుదేశం ప్రభుత్వానికి శ్రీకాకుళం జిల్లాపై ఎందుకింత నిర్లక్ష్యమని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నిం చారు. కాశీబుగ్గ టీకేఆర్ కల్యాణమండపంలో ఓ శుభకార్యానికి గురువారం హాజరైన ఆయన పలాస రైల్వే స్టేషన్ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో టీడీపీ సర్కారు ఒక్క అభివృద్ధిపనీ చేపట్టలేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం వద్ద ఉన్న ఉప్పటేరుపై బ్రిడ్జి మం జూరైతే ఇంతవరకు టెండరు ప్రక్రియ కూడా పూర్తిచేయలేదని విమర్శిం చారు.

 

  పూడిలంక వంతె న నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ చెప్పారని, ఇది కూడా నీటి మూటగానే మిగిలందన్నారు. పలాస మండలం రేగులపాడు వద్ద  అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టరు వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఆఫ్ రిజర్వాయరు పనులకు మళ్లీ జిల్లా మంత్రి శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ప్రారంభంకాలేదన్నారు. రిజర్వాయర్ పూర్తయితే తప్ప పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ప్రజలకు తాగునీటి కష్టాలు తీరవన్నారు. వంశధార ఎడమకాలువ నీరు పలాస,వజ్రపుకొత్తూరు మండల రైతాంగానికి నే టికీ అందడం లేదన్నారు.

 

  ఇప్పటికైనా ఈ కాలువను ఆధునీకరించి సాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు. కాశీబుగ్గ రైల్వే ఫ్ల్లైఓవరు బ్రిడ్జి పనులు ముందుకు సాగడంలేదని, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు ఒక్క పని కూడా పూర్తి చేయలేని టీడీపీ సర్కారు మరో మూడేళ్లలో పూర్తి చేస్తాదన్న నమ్మకం ప్రజలకు లేదన్నారు. సమావేశంలో పలాస మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత జుత్తు జగన్నాయకులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రవికుమార్,

 

 పలాస కాశీబుగ్గ పట్టణ కమిటీ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్, పలాస-కాశీబుగ్గ పట్టణ కార్యదర్శి తాళాసు ప్రదీప్‌కుమార్, పలాస మండల కమిటీ అధ్యక్షుడు పైల వెంకటరావు(చిట్టి), మున్సిపల్ కౌన్సిలర్ మీసాల సురేష్‌బాబు, మాజీ కౌన్సిలర్ డబ్బీరు భవానీశంకర్, యువజన సంఘం కార్యదర్శి కొంచాడ రాజాశ్రీకాంత్, పలాస-కాశీబుగ్గ పట్టణ కమిటీ కోశాధికారి బదకల పులిరాజు, పులారి రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top