ప్రకృతి రైతు శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్


 మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: గోఆధారిత వ్యవసాయం ద్వారా అధికదిగుబడులు సాధించాలని ప్రకృతి వ్యవసాయ రైతు శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ పిలుపునిచ్చారు. ఈ విధానం ద్వారా రైతుల ఆత్మహత్యలను నిర్మూలించడంతో పాటు రసాయనరహిత పంటలను పండించవచ్చ ని తెలిపారు. జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, గ్రామభారతి స్వచ్ఛం దసంస్థ ఆధ్వర్యంలో గోఆధారిత వ్యవసాయ విధానంపై జిల్లాకేంద్రానికి సమీపంలోని శ్రీ వాసవి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన మూడురోజుల శిక్షణ కార్యక్రమా న్ని ఆయన ప్రారంభించారు.

 

 ఈ సందర్భం గా పాలేకర్ మాట్లాడుతూ..దేశంలో ప్రస్తుత వ్యవసాయ విధానంలో రసాయనాల వాడ కం పెరగడంతో ప్రజలు అనార్యోగానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. విదేశీ విత్తనాలు, ఎరువులు, పురుగు మం దులు దిగుమతి అవుతున్నాయని, దీనివల్ల దేశసంపద విదేశాలకు తరలివెళ్తుందన్నా రు. రసాయన ఎరువులతో రోజురోజుకు భూసారం తగ్గి దిగుబడులు తగ్గుతున్నాయ ని ఆవేదన వ్యక్తంచేశారు.

 

  ప్రకృతి ఎరువులు వాడిన మన పూర్వీకవులు వ్యవసాయం చేసే రోజుల్లో ఎకరాకు 30 నుంచి 35 క్విం టాళ్ల వరిధాన్యం దిగుబడి కాగా, అది నేడు 10 నుంచి 12 క్వింటాళ్లకు పడిపోయిందన్నారు. రసాయనాల వాడకం వల్లే ఈ దుస్థి తి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. సేంద్రియ పద్ధతులను ఉపయోగించి హరి త విప్లవం సాధించేందుకు 60 ఏళ్లుగా కృషిచేస్తున్నా..ఇప్పటివరకు స్వయంప్రతిపత్తి సాధించలేకపోయామన్నారు. రసాయన ఎ రువులను వాడుతూ పంటలు పండిస్తూ పో తే పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహా రాన్ని అందించలేమన్నారు. మన ప్రకృతిని, వ్యవస్థను నాశనం చేస్తున్న పరపీడన వ్యవస్థ నుంచి బయటికి రావాలని పాలేకర్ పిలుపునిచ్చారు.

 

 యుద్ధప్రాతిపదికన

 ప్రకృతి వ్యవసాయ విస్తరణ: కలెక్టర్

 ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో జిల్లాలోని 700 గ్రామాల్లో మొదటి విడతగా పెట్టుబడిలేని గోఆధారిత వ్యవసాయాన్ని విస్తరించేందుకు కృషిచేయనున్నట్లు కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ తెలిపా రు. రైతులు వ్యవసాయసాగులో పెట్టుబడులను పెట్టడానికి ఇబ్బందిపడుతున్న సమయంలో ఇలాంటి జీరో బడ్జెట్ వ్యవసాయం సాగువిధానాలు సుభాష్ పాలేకర్ ప్రజల ముందుకు తీసుకురావడం ఎంతో సంతోషదాయమని కొనియాడారు. ఈ పద్ధతుల ద్వారా ఇప్పటికే దేశంలో చాలారైతులు తక్కువపెట్టుబడితో అధిక లాభాలు పొం దుతున్నారని కలెక్టర్ వివరించారు. డ్వామా పరిధిలోని వాటర్‌షెడ్ గ్రామాల్లోని రైతులు ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాలని కోరారు. డీఆర్‌డీఏ పరిధిలోని మహిళసంఘాల ద్వారా సుస్థిర వ్యవసాయం చేపట్టాలని ఆయన సూచించారు.

 

 

 వచ్చే ఖరీఫ్‌లో పెట్టుబడిలేని వ్యవసాయసాగుకు జిల్లా యంత్రాంగం తరఫున తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మూ డు రోజులపాటు జరిగే ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. అనంతరం నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ మోహనయ్య, ఆత్మపీడీ శ్రీనివాస్, ఏపీఎంఐపీ పీడీ విద్యాశంకర్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ, పశుసంవర్థకశాఖ జేడీలు రఫీ అహ్మద్, వెం కటరమణ, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు హరి త, చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామభారతి కార్యదర్శి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top