అపెక్స్ విద్యార్థికి జాతీయ స్థాయి ప్రశంస

అపెక్స్ విద్యార్థికి జాతీయ స్థాయి ప్రశంస


ఒంగోలు వన్‌టౌన్: ఢిల్లీలో ఈ నెల 14 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాల్‌స్వచ్ఛత కార్యక్రమంలో స్థానిక సుజాతనగర్ అపెక్స్ స్కూలు 4వ తరగతి విద్యార్థి ఎం.రుషివరుణ్‌రెడ్డి పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయిలో ప్రశంసలందుకున్నాడు. సదస్సును కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు.



కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీ జవహర్ బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళల నైపుణ్యత సదస్సులో కూడా విద్యార్థి పాల్గొన్నాడు. సదస్సుకు దేశ నలుమూలల నుంచి 350 మంది పాల్గొనగా జిల్లా నుంచి ఒక్క రుషివరుణ్ మాత్రమే పాల్గొన్నాడు. స్కూలు ఆవరణ పరిశుభ్రత, బుక్‌బైండింగ్, పెయింటింగ్, వేవింగ్ తదితర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా రుషివరుణ్‌రెడ్డిని శనివారం పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో  కరస్పాండెంట్ మద్దాళి శ్రీనివాసులరెడ్డి అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top