చదువే నా లక్ష్యం

చదువే నా లక్ష్యం - Sakshi


* పుట్టినిల్లు, మెట్టినింటి వేధింపులొద్దు

* రక్షణ కోరుతున్న  ఓ వివాహిత


కృష్ణాపురం(నాగలాపురం): భర్త, త ల్లిదండ్రులు, అత్తమామల వేధింపుల నుంచి పాకాల మండ లం చిగరపల్లి గ్రామానికి చెందిన రమ్య(19) అనే వివాహిత రక్షణ కోరుతోంది. ప్రస్తుతం ఈమె నాగలాపురం మండలం కృష్ణాపురంలోని దూరపు బంధువు ఇంటిలో తాత్కాలికంగా తలదాచుకుంటోంది. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.  వైద్య విద్యలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఈమె ఆకాంక్షకు తల్లిదండ్రులు సహకరించలేదు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే అదే గ్రామానికి చెందిన సమీపబంధువు లక్ష్మీప్రసాద్‌తో  2013 అక్టోబర్‌లో బలవంతంగా వివాహం చేయించారు.



ఈ పెళ్లి ఇష్టంలేదని ఆమె ప్రతిఘటించింది. దీంతో రమ్యకు భర్త, తండ్రి కుటుంబాల నుంచి వేధింపులు అధికమయ్యూయి.  దీంతో ఆమె తిరుపతి డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. డీఎస్పీ ఆమె తండ్రి బాబు ను మందలించారు. ఆమె అభిప్రాయం మేరకు చదివించాలని సూచించడంతో పుట్టిల్లు చేరింది. దీంతో రమ్యపై తండ్రి, భర్త మరింత కసిని పెంచుకున్నారు. ఇద్దరూ కలిసి కొట్టి.. కాలితో తన్ని.. బ్లేడుతో కోసి వేధించేవారు. అంతటితో ఆగకభర్త బలాత్కరించడం లాంటి హింసాత్మక చర్యలకు దిగాడు.



ఎంతకీ ఆమె లొంగకపోతే పాలసముద్రంలోని తాతగారింటికి తీసుకెళ్లి చేతబడులు, క్షుద్రపూజలు చేయించారు. ఈ క్రమంలోఆమె తిరుపతిలోని మహిళాసంఘాలను సంప్రదించి తద్వారా మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించి హైకోర్టు ద్వారా రక్షణ కోరింది. ఏ మహిళా హోమ్‌లోనో తలదాచుకుని చదువుకోవడమే తన లక్ష్యమని రమ్య వివరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నాగలాపురం పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయంపై ఎస్‌ఐ సుమన్ తాము రమ్యకు రక్షణ కల్పిస్తామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top