మునిసిపాలిటీలపై ఆడిట్ కత్తి


ఏలూరు : పురపాలక సంఘాలపై ఆడిట్ కత్తి వేలాడుతోంది. పాలకవర్గాలు లేని మూడేళ్ల కాలానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల ఆడిటింగ్ చాలా మునిసిపాలిటీల్లో పెండింగ్‌లో పడింది. ఆ పద్దులను యుద్ధప్రాతిపదికన బయటకు తీసి ఆడిట్ పక్రియ పూర్తి చేయాలంటూ పురపాలక శాఖ డెరైక్టర్ జి.వాణీమోహన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. 2014 మార్చి వరకు అన్ని పురపాలక సంఘాల్లో ఆడిట్ పక్రియను పూర్తి చేయించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆడిట్ అధికారులు మునిసిపల్ కమిషనర్లను కలిసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అన్నిచోట్లా ఆడిటింగ్ పక్రియ పెండింగ్‌లో ఉండటంతో త్వరలోనే పురపాలక శాఖ రీజినల్ డెరైక్టర్ వి.రాజేంద్ర ప్రసాద్ ము నిసిపల్ కమిషనర్లతో త్వరలో సమీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.

 

ఏలూరులో 2010 నుంచి పెండింగ్


ఏలూరు నగరపాలక సంస్థలో నాలుగేళ్ల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పద్దులు ఆడిట్ కాలేదు. నగరపాలక సంస్థ అధికారులు 2010 నుంచి పద్దుల వివరాలను తేల్చేందుకు కుస్తీ పడుతున్నారు. కొవ్వూరు, నరసాపురం మునిసిపాలిటీల్లో ఏడాది, నిడదవోలులో రెం డేళ్లు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, భీమవరం, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో మూడేళ్లకు సంబంధించి పద్దులను ఆడిట్ చేయాల్సి ఉంది. తణుకు మునిసిపాలిటీ అన్ని సంవత్సరాల ఆడిట్ పూర్తి చేయించుకోవడం విశేషం.

 

అభ్యంతరాల సంగతేంటి!?

ఏలూరు నగరపాలక సంస్థ, జిల్లాలోని 7 మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో ఆడిట్ అభ్యంతరాలు ఎన్ని వ చ్చాయో ఆడిటింగ్ అధికారులు వద్ద లె క్కలు లేకపోవడం విశేషం. ఏలూరు నగరంలో గత ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించిన నేపథ్యంలో నగరపాలక సంస్థ సాధారణ నిధులను పక్కదోవ పట్టించి రూ.44 లక్షలు వినియోగించుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ విషయంలో తప్పెవరిదో వెల్లడి కాలేదు. ఈ నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించారు. ప్రస్తుత మునిసిపల్ డెరైక్టర్ జి.వాణీమోహన్ అప్పట్లో జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.



అదే సందర్భంలో ఏలూరు నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు. దీంతో ఈ వ్యవహారం మరుగున పడినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, అన్ని పట్టణాల్లో పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహిస్తేనే వివిధ పద్దులకు సంబంధించి అభ్యంతరాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.ఆడిట్ అభ్యంతరాలపై పూర్తి నివేదికలను, రికార్డులను అప్పగించని అధికారులు, సిబ్బందిపై 1994 పురపాలక సంఘాల చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ డెరైక్టర్ వాణీమోహన్ ఆదేశిం చారు. ఈ మేరకు మునిసిపాలిటీలకు ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top