మున్సిపల్ అధికారిపై తెలుగు తమ్ముడి దాడి

మున్సిపల్ అధికారిపై తెలుగు తమ్ముడి దాడి - Sakshi


ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్త సుంకరం నాగేశ్వరరావు మంగళవారం హల్‌చల్ చేశాడు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) ఎన్.రత్నరాజుపై కార్యాలయంలోనే కాలినుంచి చెప్పు తీసుకుని దాడి చేసి అసభ్య పదజాలతో దూషించారు.



మాది అధికార పార్టీ.. ఎవరైనా తోక జాడిస్తే ఇతనికి పట్టిన గతే పడుతుందంటూ పెద్దగా కేకలు వేస్తూ అందరినీ భయాందోళనలకు గురి చేశాడు. వెంటనే మున్సిపల్ అధికారులు, కాంట్రాక్ట్ కార్మికులు కమిషనర్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. అనంతరం ప్రదర్శనగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ సంజీవరెడ్డికి ఫిర్యాదు చేశారు.



 టీపీవో చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం రోజు మాదిరిగానే టౌన్‌ప్లానింగ్ అధికారి రత్నరాజు  కార్యాలయూనికి వ చ్చారు. అప్పటికే నాగేశ్వరరావు కార్యాలయంలో కూర్చుని ఉన్నాడు. ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఆక్రమణలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని రత్నరాజుతో అన్నాడు. ఈ విషయం కోర్టులో ఉందని టీపీవో తెలపడంతో మాటామాటా పెరిగింది.



వెంటనే తన కాలి చెప్పు తీసుకుని టీపీవోపై దాడి చేశాడు. రాయడానికి వీలు లేని అసభ్య పదజాలంతో దూషించాడు. అక్కడే ఉన్న జూనియర్ ఆసిస్టెంట్ పవన్‌కుమార్, మేనేజర్ నరేంద్రప్రసాద్, ఆర్‌ఐ సబ్దర్‌హుసేన్, బిల్‌కలెక్టర్ విశాఖబాబు అడ్డు రాగా బయటకు వెళ్లి వారిని కూడా పేరు పెట్టి పిలిచి దుర్భషలాడాడు.



 విధుల బహిష్కరణ

 దలితుడైన టీపీవో రత్నరాజుపై దాడి చేయడాన్ని నిరసిస్తూ క మిషనర్ ప్రభాకర్‌రావుతోపాటు ఏఈ సురేంద్రబాబు, మేనేజర్ నరేం మిద్రప్రసాద్, అసిస్టెంట్లు పవన్‌కుమార్, ఆర్‌ఐ సబ్దర్‌హుస్సేన్, బిల్ కలెక్టర్ విశాఖబాబుతోపాటు కార్యాలయంలోని సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులు విధులను బహిష్కరించారు. సుంకర పు నాగేశ్వరరావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ సంజీవరెడ్డికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు.



 ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

 టీపీవో రత్నరాజుపై దాడి చేసి అసభ్య పదజాలంతో దుషించిన సుంకరపు నాగేశ్వరరావుపై టీపీవో ఫిర్యాదుమేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top