'ఎంపీ కావడానికి 40.30 లక్షలు ఖర్చు చేశారు'

'ఎంపీ కావడానికి 40.30 లక్షలు ఖర్చు చేశారు' - Sakshi


న్యూఢిల్లీ : దేశంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అంతా డబ్బుల మీదే నడుస్తుంది. ఓ మాటలలో చెప్పాలంటే డబ్బు అనే పదం ఎన్నికల పర్యాయపదంగా మారింది. అయితే ఇటీవల జరిగిన16వ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన లోక్సభ అభ్యర్థులు ... వారు విజయం సాధించే క్రమంలో ఒక్కోక్కరు సగటున రూ. 40.3 లక్షలు ఖర్చు చేశారని నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్యూ), అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 537 మంది ఎంపీలుగా ఎన్నికైన నేపథ్యంలో వారు జామా ఖర్చులపై అందించిన నివేదిక ఆధారంగా ఆ సంస్థలు ఈ మేరకు తెలిపింది.  



బీజేపీకి చెందిన 277మంది ఎంపీలు ఎన్నికల కోసం 40.18 లక్షలు ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది ఎంపీలు 40.16 లక్షలు ఖర్చు చేసి రెండ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాలు వరుసగా ... ఏఐఏడిఎంకే 37 మంది ఎంపీలు ఒక్కొక్కరు 30.5 లక్షలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు 34 మంది 40.6 లక్షల ఖర్చుతో తర్వాత స్థానాన్ని ఆక్రమించారు.  



కాలిబోర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గౌరవ్ గోగోయి 80.2 లక్షలు ఖర్చు చేశారు. గుజరాత్లోని బరూచ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన మన్సుఖ్ భాయ్ దంచీభాయ్ వసావా, అలహాబాద్ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా 60.7 లక్షలు ఖర్చు చేసి ఆ తర్వాత వరుస స్థానాలలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన అశోక్ గజపతిరాజు రూ.39,369 ఖర్చు చేసి అత్యల్పంగా ఖర్చు చేసిన ఎంపీల జాబితాలో నిలిచారు.



పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్... నుంచి లోక్సభ బరిలో దిగే అభ్యర్థులకు రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షలకు అలాగే చిన్న రాష్ట్రాలైన గోవా... నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు 20.2 లక్షల నుంచి 50.4 లక్షలకు ఈ ఏడాదే పెంచిన సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top