మాతృభాషలో విద్యాబోధన జరగాలి

మాతృభాషలో విద్యాబోధన జరగాలి - Sakshi


 ఏఐఎఫ్‌ఈఏ   జాతీయ అధ్యక్షుడు{బిజ్‌నందన్‌శర్మ

 


తిరుచానూరు : ప్రాథమిక స్థాయి నుం చి ఉన్నత విద్య వరకు మాతృ భాషలో బోధన జరిగినప్పుడే విద్యార్థులకు పరిపూర్ణ విద్య అందుతుందని అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్‌ఈఏ) జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ బ్రిజ్‌నందన్‌శర్మ తెలిపా రు. తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్‌లో ఆదివారం విద్యారంగ సమస్యలు(కేంద్రం, రాష్ట్రం) అనే అంశంపై ఒక రోజు జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఏఐఎఫ్‌ఈఏ సహాధ్యక్షులు కే.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే అంశాలపై 30ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాలలో ఒకే విద్యా విధానం అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి వివేకానందదాస్ మాట్లాడుతూ దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని పాలకులు చెబుతున్న మాటలు ఒట్టివేనన్నారు.



కొఠారి కమిషన్ రూపొం దించిన నివేదికను అమలుచేసినప్పుడే విద్యావిధానం బలోపేతమవుతుందని వివరించారు. అంతకుముందు గౌరవ అతిథులుగా పాల్గొన్న తిరుపతి ఎమ్మె ల్యే సుగుణమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణీ సదస్సును ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించేందుకు తెలుగును ఆచరణలోకి తీసుకురావాల్సి ఉందన్నారు.  ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.హృదయరాజు, ఏఐఎఫ్‌ఈఏ పశ్చిమబెంగాల్ సంఘటనా కార్యదర్శి ప్రభుకుమార్ కర్మకార్, కార్తీక్ సహా, జార్ఖండ్ నుంచి సంధ్య ప్రధాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ.చెంగల్రాయ మంద డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.జయరామయ్య, ఏపీటీఎఫ్ జిల్లా కన్వీనర్ ఎస్.వెంకటముని పాల్గొన్నారు.



తీర్మానాలు..

విద్యావ్యాపారాన్ని అరికట్టాలి. ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రభుత్వాలే అందించాలి.

దేశంలో నిరక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థకు మూలకారణం పేదరికం. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.

{పపంచ వాణిజ్య రంగంలో విద్యారంగాన్ని చేర్చే చర్యలను వ్యతిరేకించడం, డబ్ల్యూటీవో నుంచి భారత్ వైదొలగడం.

విదేశీ విశ్వవిద్యాలయాలను ఆకర్షిం చే, స్వదేశంలో వ్యాపార విద్యాలయాలను ప్రోత్సహించే చర్యలను ఆపాలి.

పాఠశాల స్థాయిలో మాతృ భాషలోనే బోధన జరగాలి. అవసరం మేరకు ఇంగ్లిష్, ఇతర భాషలు నేర్పాలి.

దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపట్టాలనే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top