భావి తరాలకు మార్గదర్శి మోక్షగుండం

భావి తరాలకు మార్గదర్శి మోక్షగుండం

ఘనంగా ఇంజనీర్స్ డే

 

 కల్లూరు రూరల్: దేశంలోని భావి ఇంజనీర్లకు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకులని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. దూపాడులోని  కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్‌డేను పురస్కరించుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు.  కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ విజయలక్ష్మమ్మ, ప్రిన్సిపాల్ తిమ్మయ్య పాల్గొన్నారు.

 శాలువలు వద్దూ..దుప్పట్లు కావాలి..: ఇంజనీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ రవికృష్ణను కళాశాల యాజమాన్యం శాలువతో సన్మానించారు. అయితే ఆయన తనకు శాలువలు వద్దని, విధి నిర్వహణలో భాగంగా రాత్రి వేళ గస్తీ తిరుగుతుండగా చాలా మంది పేదలు కప్పుకునేందుకు దుప్పట్లు లేక చలికి వణుకుతున్నారన్నారు. అలాంటి వాళ్ల కోసం దుప్పట్లు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ సూచించడంతో  కేవీ సుబ్బారెడ్డి  500 దుప్పట్లు గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న  పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.  

 శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో..: నగర శివారులోని శ్రీని వాస ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీనివాస రావు మోక్షగుండం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ డిప్యూటీ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ కే.నాగరాజు హజరయ్యారు.  

 విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ 

 కర్నూలు(అర్బన్): విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని జేఎన్‌టీయు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని విశ్వేశ్వరయ్య సర్కిల్‌లో కర్నూలు జిల్లా టెక్నికల్ ఫోరం ఆధ్వర్యంలో 47వ ఇంజనీర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ శ్రీనివాసరెడ్డి, పీ నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హేమచంద్రారెడ్డి ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రోడ్లు,భవనాలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఎస్‌ఎస్‌ఏ, ఏపీఎస్‌ఐడీసీ, హౌసింగ్, ఇరిగేషన్  తదితర విభాగాలకు చెందిన ఇంజనీర్లు  విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డెరైక్టర్ జయరామిరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ నాగేశ్వరరావు,ఆర్‌అండ్‌బీ ఈఈ ఉమామహేశ్వర్, డీఈఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ ఫణిరామ్, హెచ్‌డీ ప్రసాదరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ డీఈఈ కేవీకేవీ ప్రసాద్‌తో పాటు పలువురు రిటైర్డు ఇంజనీర్లు పాల్గొన్నారు.

 

 

 

 


 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top