అంబులెన్స్‌లలో ఆధునిక పరికరాలు

అంబులెన్స్‌లలో ఆధునిక పరికరాలు - Sakshi


జిల్లాలో 108 వాహనాలు 43

పరికరాలకు మంజూరైన నిధులు రూ.83 లక్షలు


 

బి.కొత్తకోట: ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని రక్షించడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2005లో జిల్లాలో 108 సేవలను ప్రారంభిం చారు. 5 అంబులెస్సులతో ప్రారంభమైన 108లు ఇప్పుడు 43 ఉన్నాయి. ఇంతకాలం 108 వాహనాల్లో సాధారణ పరికరాలు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు కొత్త పరికరాలు వచ్చి చేరబోతున్నాయి. గుండె, ఊపిరి తిత్తుల పనితీరు తెలుసుకోవడం, విషం తాగిన వారికి అక్కడికక్కడే ఉపశమనం కలిగే ంచే పరికరాలు, ఆక్సిజన్ అందించే సిలిండర్, నాడి కొట్టుకునే తీరును తెలుసుకునే పల్స్ ఆక్సిమేటర్లను కొత్తగా తీసుకొచ్చారు. రూ.83 లక్షలతో ప్రభుత్వం ఈ పరికరాలను అందించింది.





 ఎంతో ప్రయోజనం

ప్రభుత్వం అందించిన సక్షన్ ఆపరేటర్ అనే యంత్రం విషం తాగిన వారిని కాపాడేందుకు సంజీవనిలా ఉపయోగపడుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతం లో ఇలాంటి సంఘటనలు జరినప్పుడు 108 అక్కడుకు వెళ్లలేని పరిస్థితులుంటే, సిబ్బందే సక్షన్ ఆపరేటర్‌ను తీసుకెళ్లి చికిత్స అందిస్తారు. దీనితో 80 శాత ం ప్రాణాపాయం తప్పుతుంది. అలాగే 108లో బాధితులను తరలించే సమయంలో గుండె పనితీరు, బీపీ పల్స్ తెలుసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పేషం ట్ మానిటర్ చెక్ పెడుతుంది. ఇందులో బాధితుని లంగ్స్, గుండె పనితీరు ప్రత్యక్షంగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగా ఏలాంటి వైద్యసేవలు అందించాలో 108 ప్రధాన కేంద్రం నుంచి సిబ్బంది సూచనలు తీసుకొంటూ వైద్యం అందిస్తారని అధికారులు చెబుతున్నారు.

 

 

 108 సిబ్బందికి శిక్షణ

 గుండె సంబంధిత వైద్యంపై 108 వాహనంలో పేషంట్ మానిటర్ ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని వినియోగించే విషయంలో సిబ్బందికి సూచనలు, సలహాలు ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. ప్రముఖ కార్డియాలజిస్టు ద్వారా శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. 108ల్లో ఒక్కోదాంట్లో ఒక పేషంట్ మానిటర్ (రూ.1.40 లక్షలు), సక్షన్ ఆపరేటర్ (రూ.38 వేలు), బీటైప్ ఆక్సిజన్ సిలిండర్ (రూ.4వేలు), పల్స్ ఆక్సివేటర్ (రూ.11 వేలు)ను ఏర్పాటు చేయనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top