ఎమ్మెల్సీగా పోటీకి కోదండరాం ససేమిరా

ఎమ్మెల్సీగా పోటీకి కోదండరాం ససేమిరా - Sakshi

  • పట్టభద్రుల స్థానం నుంచి పోటీకి పెట్టాలని లెఫ్ట్ యోచన

  • సీపీఎం నేత ప్రతిపాదనను తిరస్కరించిన టీజేఏసీ నేత

  • సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయించాలనే వామపక్షాల ప్రతిపాదనను తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో టీజేఏసీ నుంచి లేదా వామపక్ష భావజాలమున్న ఎవరైనా మేధావిని పోటీచేయిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయంతో ఈ పార్టీలున్నాయి.



    త్వరలోనే రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు (హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు - ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నియోజకవర్గాలకు) ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. భవిష్యత్ రాజకీయాల్లో ప్రగతిశీల,వామపక్ష, ప్రజాస్వామ్యశక్తులకు బలం చేకూర్చేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీజేఏసీ చైర్మన్ కోదండరాంను నిలబెట్టాలనే ప్రతిపాదనపై చర్చించిన పది వామపక్షాలు ఆయనను సంప్రదించాలని నిర్ణయించా యి.



    ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ను  ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి పోటీ చేయించాలనే అభిప్రాయానికి వచ్చాయి. ఈ  నేపథ్యంలో సీపీఎం ముఖ్యనేత ఒకరు కోదండరాంను సంప్రదించగా టీ జేఏసీ భేటీలో చర్చించాక తమ నిర్ణ యం చెబుతామని ఆయన పేర్కొన్నట్లు తెలి సింది. అయితే రాజకీయాలంటే తనకు ఎలాంటి ఆసక్తి లేదని, ఎమ్మెల్సీగా పోటీ అనే విషయాన్ని కనీసం ఊహించలేనని సన్నిహితుల వద్ద స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.



    ఈ పరిస్థితు ల్లో జేఏసీ నుంచి మరెవరినైనా పెట్టాలా.. లేక  కమ్యూనిస్టు పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలపాలా? అన్న దానిపై వామపక్షాలు నిర్ణయం తీసుకోలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానం నుం చి ఎవరిని పోటీచేయించాలనే అంశంపై చర్చ జరిగినపుడు వామపక్ష మేధావి హరగోపాల్ పేరుతోపాటు, ఒకరిద్దరు జేఏసీ నాయకుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే హరగోపాల్‌కు కూడా పోటీచేసేందుకు ఎలాంటి ఆసక్తి లేదని ఇతర నాయకులు పేర్కొనడంతో.. ఆమోదయోగ్యమైన అభ్యర్థిని వెదకాలనే నిర్ణయానికి ఈ పార్టీల నాయకులు వచ్చారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top