పడుకున్న చోటే ప్రాణం తీశారు..


► ఇంటి ఆరు బయట నిద్రిస్తుండగా ఘాతుకం

► వివాహేతర సంబంధమే కారణమని అనుమానం?

► హత్యా ప్రదేశంలో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు




కారూరు (తడ) : ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న ఓ యువకుడిని గురువారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన మండలంలోని కారూరులో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన  ఆబాకం వైరమ్మ రెండో కుమారుడు ప్రకాష్‌ (25) లారీడ్రైవర్‌గా పని చేస్తున్నారు. పెద్ద కుమారుడు రాజాకు వివాహమైంది. ప్రకాష్‌కు ఇంకా పెళ్లి కాకపోవడంతో గ్రామంలోనే మరో ఇంట్లో విడిగా ఉంటున్నాడు.



ఇతనికి గ్రామంలోని ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉంది. అతని తల్లి వైరమ్మ పెద్ద కుమారుడి వద్ద ఉంటూ రోజూ వచ్చి ప్రకాశ్‌ ఉంటున్న ఇల్లు శుభ్రం చేసి వెళ్తుండేది. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున ఆమె ఇంటికి రావడంతో కొడుకు రక్తపు మడుగులో ఉండటంతో చూసి కేకలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి హత్యతో తల్లి వైరమ్మ గుండెల అవిసేలా రోదించి సొమ్మసిల్లి పడిపోయారు.


ముందుగానే రెక్కీ వేసి హత్య

అయితే ప్రకాశ్‌ హత్యకు ముందు హంతకులు రెక్కీ వేసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు హత్యా ప్రాంతంలో కత్తులతో సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రకాశ్‌తో వివాహేతర సంబంధం ఉన్న మహిళ అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వెళ్తుండటంతో ఆమె వచ్చి ఉంటుందని స్థానికులు భావించి అటువైపు కూడా చూడలేదని చెబు తున్నారు. హతుడికి మద్యం అలవాటు ఉండటంతో అతనిని హతమార్చడం హంతకులకు సులSభం అయి ఉంటుందని భావిస్తున్నారు.



దుండగులు ప్రకాశ్‌ నుదురు, చెవి వెనుక భాగంలో దారుణంగా కత్తి తో నరకిన గాయాలు ఉండటంతో చూస్తే వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన హత్యగా స్థానికులు భావిస్తున్నారు. ఇదే విషయమై పోలీసులకు వివరించా రు. ప్రకాశ్‌ రెండు.. మూడు కేసుల్లో జైలుకు కూడా వెళా ్లడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


డాగ్‌ స్క్వాడ్‌కి అందని క్లూ

హత్య తెల్లవారుజామున జరిగినట్టు స్థానికుల సమాచారం మేరకు తెలుస్తోంది. సమాచారం అందుకున్న తడ ఎస్‌ఐ సురేష్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నెల్లూరు నుంచి పోలీస్‌ జాగిలాన్ని రప్పించి ప్రాథమిక ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించారు. జాగిలం సంఘటనా స్థలం చుట్టుపక్కల సంచరించి, బయట నాలుగు వీధులు తిరిగి నిలిచి పోయింది.   అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top