చంద్రబాబు నాయుడుకు వైద్యపరీక్షలు
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని కేర్ ఆస్పత్రి ఔట్ పేషెంట్ విభాగంలో దాదాపు 45 నిమిషాలసేపు ఆయన ఉన్నారు.
చంద్రబాబుకు ఇఎన్టి విభాగంలో వైద్య పరీక్షలు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన సాదారణ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు భావిస్తున్నారు.