మందులున్నాయి


  • కుక్కకాటు, పాముకాటుకు ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత లేదు

  •  అవగాహన లేక ప్రయివేటు వైద్యశాలకు బాధితుల పరుగులు

  • చిత్తూరు(సిటీ):  పాము, కుక్కకాటుకు ప్రభుత్వ, ఏరియా, కమ్యూనిటీ వైద్యశాలలు, ప్రాథమిక వైద్యశాలల్లో మందులు సమృద్ధిగా ఉన్నాయి. కానీ వాటిపై బాధితులకు అవగాహన కల్పించడంలో వైద్యాధికారులు విఫలమవుతున్నారు. దీంతో కుక్క, పాము కాటుకు గురైన వారు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి భారీగా నష్టపోతున్నారు.

         

    వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో 300 పడకలున్న చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలతో పాటు, 100 పడకలున్న ఆరు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి.

         

    30 పడకలున్న 8 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లును నిర్వహిస్తున్నారు.

         

    జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 94 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి.

         

    చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కుక్కకాటుకు విరుగుడు మందు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు 951, పాముకాటుకు గురైన వారికి వినియోగించే వ్యాక్సిన్లు 860 ఉన్నాయి.

         

    జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కుక్కకాటు వ్యాక్సిన్లు 848, పాముకాటు వ్యాక్సిన్లు 260 ఉన్నాయి.

         

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (తంబళ్లపల్లె, కుప్పం మి నహా) కుక్కకాటు వ్యాక్సిన్లు 2075, పాముకాటు వ్యాక్సిన్లు 1400 ఉన్నాయి.



    పైవేటు’ వైపు పరుగులు

     

    ప్రభుత్వ వైద్యశాలల్లో కుక్క, పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నా తెలియని బాధితులు తమకు సమీపంలోని ప్రైవేటు వైద్యశాలల వైపు పరుగులు తీస్తున్నారు.  ఒక్కో వ్యా క్సిన్‌కు రూ. 800 నుంచి 1000 వరకు ఖర్చుచేస్తున్నారు. ఫుల్ కోర్సు రూపంలో మరికొన్ని రోజులు సూది మందులు వేసుకునేందుకు మరో రూ. 10 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.  విషంలేని పాములు కరిచినా, తెలియక వేలాది రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారు.



    ప్రధాన వైద్యశాలలు, ప్రా థమిక వైద్యశాలల్లో మాత్రం పాము, కుక్కకాటు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలను పోస్టర్ల ద్వారా ప్రచా రం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి తరహా ప్రచా రం లేకపోవడంతో విషం ఉన్న, లేని పాముకాటు గురించి తెలియని అభాగ్యులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. వైద్యాధికారులు స్పందించి పాము, కుక్కకాట్లపై అవగాహన, ప్రాథమిక చికిత్స, వైద్యం చేయించుకునే విధానంపై బాధితులకు తెలపాల్సిన అవసరం ఉంది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top