చిట్టితల్లికి ఎంత కష్టం!


జ్ఞానసాయిని కబళిస్తున్న మృత్యు రాకాసి

శాపంగా మారిన కాలేయ సంబంధ జబ్బు

మహానాడులో ముఖ్యమంత్రికి  విన్నవించినా అందని భరోసా

దాతల సాయం కోసం ఎదురుచూపు

కారుణ్య మరణానికి అనుమతించాలంటూ పిటిషన్


 


పుట్టినప్పటి నుంచి అనారోగ్యం ఆ చిన్నారికి  శాపమైంది. ఎనిమిది నెలలుగా కాలేయ వ్యాధి రోజురోజుకూ తీవ్రమౌతూ వేధిస్తోంది.         బిడ్డ పడుతున్న బాధను చూసి తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ చిన్నారికి ప్రాణభిక్షపెట్టాలని దాతలను వేడుకుంటున్నారు. చివరికి కాలేయ మార్పిడి చేసే స్తోమత లేక కూతురి   కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు.




తంబళ్లపల్లెః తమ బిడ్డకు కాలేయ సంబంధ వ్యాధి సోకడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎలాైగె నా కాపాడుకునేందుకు కనిపించిన ప్రతి ఒక్కరికీ మొక్కుతున్నారు. అయినా వారి కష్టం తీరడం లేదు. దీంతో విసిగి వేసారి తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్డును ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ  బత్తలాపురం రైల్వేస్టేషన్‌కు చెందిన రమణప్ప, సరస్వతిలది పేద కుటుంబం. రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. రమణప్ప బెంగళూరులోని సూపర్‌మార్కెట్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి గత ఏడాది అక్టోబర్ 10న మదనపల్లెలోని దేశాయ్ ఆసుపత్రిలో  కుమార్తె (జ్ఞానసాయి) పుట్టింది.


 

పుట్టిన వెంటనే సురక్ష ఆసుపత్రిలో రెండు రోజులపాటు ఆ పసికూనను ఐసీయూలో ఉంచారు. అనంతరం వివిధ పరీక్షలు చేసి తిరుపతిలోని ఓం ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడి డాక్టర్లు  ఆ చిన్నారికి వైద్య పరీక్షలు చేసి బిలియరీ అట్రాసియా(కాలేయం జబ్బు) ఉన్నట్లు నిర్ధారించి రెండు వారాల్లోపు లివర్ ప్రైమరీ సర్జరీ చేయాలని ఇందుకు సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పడంతో వారికి దిక్కుతోచక ఇంటిముఖం పట్టారు. డబ్బు సమకూర్చుకుని నెల తరువాత బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి డాక్టర్లు గత ఏడాది డిసెంబర్ 31న సర్జరీ చేశారు. నాలుగు నెలల తరువాత ఫలితం చెబుతామని అక్కడే వైద్య చికిత్సలు అందించారు. సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చుచేసినట్లు ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. నాలుగు నెలల తరువాత తిరిగి బిడ్డను అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ విఫలమైందని చెప్పారు. ఆ మాట వినగానే ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కూడా ఆ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి లివర్ పూర్తిగా మార్పుచేస్తే ఫలితం ఉంటుందన్నారు. ఇందుకు రూ.15 నుంచి 16 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పినట్లు తెలిపారు. కాలేయం మార్పిడి తర్వాత కోలుకునేందుకు ఏడాది నుంచి రెండేళ్ల కాలం వరకు పడుతుందనీ, ఆ సమయంలో నెలకు రూ.50 వేల విలువైన మందులు వాడాలని వైద్యులు చెప్పారని స్పష్టంచేశారు. నాలుగు నెలలోపు మార్పుచేయాలని లేకుంటేప్రమాదమేనని తెల్చిచెప్పడంతో ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.


 

చంద్రన్న బరోసా ఏదీ..?


తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ.. తిరుపతిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినతిపత్రం అందించినట్లు రమణప్ప తెలిపాడు. అయితే ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని వాపోయాడు.


 

తంబళ్లపల్లె న్యాయమూర్తికి వినతి


ఆర్థిక స్థోమతలేక అప్పులు దొరక్కా ఏం చేయాలో దిక్కుతోచక కేరింతలు కొట్టే వయసులో ఆ బాలికలను చూస్తూ కుమిలిపోతున్నారు. చివరికి చేసేదిలేక కనీసం న్యాయస్థానానైనా ఆశ్రయిద్దామనే ఆశతో ఆ దంపతులు గురువారం తంబళ్లపల్లె కోర్టుకు వచ్చారు. తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ కారుణ్య మరణానికి అనుమతించాలని న్యాయమూర్తి వాసుదేవ్‌కు విన్నవించుకున్నారు. ఆయన స్పందిస్తూ ఇలాంటి కేసుల్లో ఉన్నత న్యాయస్థానాలే నిర్ణయం తీసుకుంటాయని, వీలైతే రాజకీయ నాయకుల సహాయం కూడా తీసుకోవాలనీ సూచించించారు. దీంతో మరింత ఆవేదన చెందుతూ చేసేదిలేక వెనుదిరిగారు. కనీసం దాతలైనా తమ బిడ్డకు ప్రాణభీక్ష పెట్టి పునర్జన్మ ప్రసాదించాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సాయం చేసే వారు 8142272114 నంబరులో సంప్రదించవచ్చు. 23టిబిపి31: తండ్రితో చిన్నారి జ్ఞానసాయి ప్రమాదమేనని తేల్చిచెప్పడంతో ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.


 

చంద్రన్న భరోసా ఏదీ..?


తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ.. తిరుపతిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినతిపత్రం అందించినట్లు రమణప్ప తెలిపాడు. అయితే ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని వాపోయాడు.


 

తంబళ్లపల్లె న్యాయమూర్తికి వినతి


ఆర్థిక స్థోమతలేక.. అప్పులు దొరక్క.. ఏం చేయాలో దిక్కుతోచక.. కేరింతలు కొట్టే వయసులో ఆ బాలికను చూస్తూ కుమిలిపోతున్నారు. చివరికి చేసేదిలేక కనీసం న్యాయస్థానాన్నైనా ఆశ్రయిద్దామనే ఆశతో ఆ దంపతులు గురువారం తంబళ్లపల్లె కోర్టుకు వచ్చారు. తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ కారుణ్య మరణానికి అనుమతించాలని న్యాయమూర్తి వాసుదేవ్‌కు విన్నవించుకున్నారు. ఆయన స్పందిస్తూ ఇలాంటి కేసుల్లో ఉన్నత న్యాయస్థానాలే నిర్ణయం తీసుకుంటాయని సూచించారు. దీంతో మరింత ఆవేదన చెందుతూ చేసేదిలేక వెనుదిరిగారు. కనీసం దాతలైనా తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టి పునర్జన్మ ప్రసాదించాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సాయం చేసే వారు 8142272114 నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top