కడపలో మద్యం డిపో సీజ్
కడప : కడప జిల్లా శివారులో ఉన్న ఏపీడీసీఎల్కు చెందిన మద్యం గోడౌన్ లో ఇన్కంటాక్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను కట్టకుండా నడుపుతున్న మద్యం డిపోలను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. 2004 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆదాయపు పన్ను చెల్లించక పోవడంతో చెల్లించవలసిన బకాయి మొత్తం 116 కోట్లకు చేరింది. దీంతో ఇన్కంటాక్స్ అధికారులు గోడౌన్ను సీజ్ చేశారు.