లెనిన్ ఆశయాలు సాధించాలి


విజయవాడ స్పోర్ట్స్ : అంతర్జాతీయ ఆర్చర్, కోచ్ చెరుకూరి లెనిన్ నాలుగో వర్ధంతి నగరంలో చెరుకూరి లెనిన్ -వీఎంసీ ఆర్చరీ అకాడమీలో శుక్రవారం జరిగింది. అకాడమీ ఆవరణంలో లెనిన్ విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. అనంతరం నగర మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు ప్రసంగించారు.



గద్దె రామ్మోహన్‌రావు మాట్లాడుతూ సంప్రదాయ విలువిద్య క్రీడలో అహర్నిశలు శ్ర మించి కామన్వెల్త్ గేమ్స్‌లో తన శిష్యబృందంతో పతకాలు సాధించడంలో సఫలీకృతుడయ్యారని గుర్తుచేశారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని క్రీడా రాజధానిగా తీర్చిది ద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌లో దేశానికి ఆర్చరీ పతకాన్ని అందించే క్రీడాకారులు శిక్షణ పొందుతున్న చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి అవసరమైన కొరియన్ కోచ్ నియామకంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు.



చెరుకూరి లెనిన్ స్ఫూర్తితో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ చిన్నతనంలో ద్రాణాచార్యుడిగా పిలిపించుకున్న ఘనత ఒక్క లెనిన్‌కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు నగర పాలక సంస్థ సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.



ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ పతక విజేత పూర్వాష సుధీర్ షిండే సన్మాన కార్యక్రమంలో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు సమక్షంలో కొరియన్ కోచ్ కావాలని లెనిన్ తండ్రి చెరుకూరి సత్యనారాయణ కోరారని, స్పందించిన సీపీ తక్షణమే బడ్జెట్ ఎంత కావాలని కోరగా, రూ.1.39 కోట్లకు నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు.



ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి, స్పాన్సర్ల నుంచి సేకరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్‌డీవో పి.రామకృష్ణ, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ రామ్ బొబ్బా, జిల్లా చైర్మన్ కె.పార్థసారథి, కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి గాంధీ, దాసరి మల్లేశ్వరి, కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఐద్వా నాయకురాలు వనజకుమారి, అకాడమీ ఆర్చర్లు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

అకాడమీకి రూ.లక్ష విరాళం




ఆసియా క్రీడల్లో తన కుమార్తె కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన చెరుకూరి ఓల్గా-వీఎంసీ అకాడమీకి పూర్వాష సుధీర్ షిండే తండ్రి సుధీర్‌షిండే (మహారాష్ట్ర-అమరావతి) లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. తొలుత విశాఖపట్నం హుదూద్ బాధితల కోసం సీఎం సహాయ నిధికి ఇవ్వాలని రూ.లక్ష చెక్కును ఆయన ఎమ్మెల్యేలకు ఇవ్వగా వారు అకాడమీకి ఇవ్వాలని సూచించా రు. ఈ మేరకు ఆ చెక్కును తన కుమార్తె పూర్వాషతో కలిసి ఎమ్మెల్యేల చేతులు మీదుగా  చెరుకూరి సత్యనారాయణకు అందజేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top