చట్టం పట్టని వైద్యం !

చట్టం పట్టని వైద్యం ! - Sakshi


ఏపి అల్లోపతిక్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2007...పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలను సాధారణ ఫీజులతో అందించేందుకు  ఏర్పాటు చేసిన చట్టం ఇది.. ఇది జిల్లాలో 2008 నుంచి అమలులోకి రాగా, ఇప్పటి వరకు 1082 ఆస్పత్రులు, ల్యాబ్‌లు మాత్రమే రిజిస్టర్ చేయించుకున్నాయి.



ల్యాబ్‌లు, ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, స్కానింగ్ సెంటర్లు, ఎక్సరే కేంద్రాలు అన్నీ కూడా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ కాకుండా వైద్యం చేయటం చట్టరీత్యా నేరం.


 

 సాక్షి, గుంటూరు : జిల్లాలో అనేక మంది రిజిస్ట్రేషన్‌లు చేయించకుండా ఆసుపత్రులు, ల్యాబ్‌లు నడుపుతున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆసుపత్రు ల్లో ఫీజుల వివరాలను తెలిపే బోర్డులు పెట్టకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ రోగులను అందినకాడికి దండుకుంటున్నార నే ఫిర్యాదులు తీవ్రంగా వినిపిస్తున్నాయి.



  చట్టం అమలుకు ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి చైర్మన్‌గా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, ఏపి నర్సింగ్ హోమ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సభ్యులుగా, జిల్లా సలహాకమిటి సంఘం సభ్యులుగా ఐఎమ్‌ఏ, ఏపి నర్సింగ్ హోమ్‌కు చెందిన వారు లీగల్, కన్జూమర్ సంస్థలకు  కమిటీలో చోటు కల్పించాలి.



  ఇప్పటి వరకూ ఈ కమిటీలో ఎవ్వర్నీ చేర్చకుండా డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం లోని అధికారులే కమిటీని నిర్విహ ంచడం చట్టంపై వారికున్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది.



 కమిటీ సభ్యులు లేకుండానే తనిఖీలు..

  కమిటీలో అందరినీ చేర్చకుండా జిల్లా వైద్యాధికారులు చట్టానికి వక్రభాష్యం చెబుతున్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయ పరిపాలనాధికారి రత్నరాజు, సీనియర్ అసిస్టెంట్ సీతారామిరెడ్డి మాత్రమే తనిఖీలకు వెళుతున్నారు.



  గతంలో పరిపాలనాధికారిగా పనిచేసిన రమేష్‌బాబు ఇదే తరహాలో పనిచేయగా నేడు కమిటీకి ఏ మాత్రం సంబంధలేని ఏఓ రత్నరాజు, సీనియర్ అసిస్టెంట్‌లు తనిఖీలకు వెళ్లి  మాముళ్లు తీసుకుని రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.



 నిధులు దుర్వినియోగం... చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్పత్రులు, ల్యాబ్‌లు తదితర వైద్య సంస్థల నుంచి నిర్ధేశించిన ఫీజులు వసూలు చేసిన జిల్లా వైద్యాధికారులు ఆ నిధులలో కొంత తనిఖీలకు వెళ్లే సభ్యులకు గౌరవ వేత నంగా చెల్లించాలి.



  చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వైద్యులతో సమీక్షలు నిర్వహించే ందుకు ఆ నిధులు వినియోగించాలి. కాని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం అధికారు లు సభ్యులు లేకుండానే ఆ నిధులను తమ సొంతానికి వాడుకుంటున్నారు. ఇలా సుమారు రూ. ఇరవై లక్షల వరకు ఖర్చుచేశారు.



 తనిఖీలకు మేమే వెళుతున్నాం.. ఆసుపత్రులు, ల్యాబ్‌లను తనిఖీ చేసేందుకు నేను, ఏఓ రత్నరాజు, సీనియర్ అసిస్టెంట్ సీతారామిరెడ్డి వెళుతున్నాం. అల్లోపతిక్ యాక్ట్ ప్రకారం జిల్లాలోని వైద్యు లందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు తప్పని సరిగా ఫీజుల వివరాలను నోటీస్‌బోర్డులో ఉంచాలి. లేని పక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఆస్పత్రుల నిర్వాహకులకు నోటీసులు ఇవ్వబోతున్నాం.

 -  డీఎంఅండ్‌హెచ్‌ఓ

 డాక్టర్ నాగమల్లేశ్వరి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top