కరువుకు కేరాఫ్ కుప్పం!


ఒకప్పుడు పచ్చని పంటలు.. చక్కటి లాభాలకు నిలయమైన కుప్పం ఇప్పుడు కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆరేళ్లుగా ఆశించిన వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి. వేల అడుగుల లోతు బోర్లు వేసినా భూగర్భజలాలు పైకిరాని పరిస్థితి. తాగడానికీ గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి. దేవుడిపై భారమేసి పంటలెట్టినా పిడికెడు గింజలు చేతికందని దయనీయ స్థితి. విధిలేని పరిస్థితుల్లో ఇల్లూ..వాకిలి వదలి పొట్టచేతబట్టుకుని పట్టణాలకు వలసబాట పట్టాల్సి వస్తోంది. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటికే 40 శాతం గ్రామాలు ఖాళీ అయ్యాయి. కుప్పం: వర్షాలు సక్రవుంగా కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయూరుు.



1250 అడుగు లోతు లో బోర్లు వేసినా నీరు దొరకని పరిస్థితి. నియోజకవర్గ పరిధిలో రెండు లక్షల 53 వేల ఎకరాల వ్యవసాయు సాగు భూమి ఉంది. సాగు నీరు లేక లక్షా 80 వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. నియోజకవర్గంలోని 571 చెరువుల్లో చుక్క నీరు లేదు. 24 వేల వ్యవసాయు బోర్లు అడుగంటిపోయూరుు. వ్యవసాయూనికి సాగునీరు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది. కనుచూప మేర పచ్చటి పొలాలు కన్పించడం లేదు. మేత దొరక్క పోవడంతో వేలాది పశువులను క బేళాలకు తరలించారు.

 

తాగునీటి ఎద్దడి తీవ్రం




నియోజకవర్గంలో 380 గ్రావూల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. 212 గ్రావూలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రెండు,వుూడు రోజలకు ఓసారి ట్యాంకరు నీరు చాలకపోవడంతో గ్రామీణ ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. 1250 అడుగల లోతుకు వేస్తున్నా నీరు లభ్యం కాకపోడంతో బోర్లు వేసేందుకు రైతులు, అధికారులు సాహసించడం లేదు. దీంతో గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు అధికారులు సతవుతమవుతున్నారు. కుప్పం ప్రాంతంలో నీటి సవుస్య పరిష్కరించడం అధికారులకు సవాల్‌గా వూరింది.



అతుకుల ఆర్టీసీ.. గతుకుల రోడ్లు



 కుప్పం ఆర్టీసీ డిపోలోని బస్సులు అధ్వానంగా మారా యి. 94 బస్సులకు గాను 102 సర్వీసులు నడుపుతున్నారు. 94 బస్సుల్లో 28 బస్సులు కాలం చెల్లినవే. గ్రా వూలకు సకాలంలో బస్సులు లేకపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని రోడ్లన్ని కంకర్లు తేలి గుంతలవుయుంగా మారాయి. ఆర్‌ఆండ్‌బీ పరిధిలోని 486 కిలోమీటర్లు, పంచాయుతీరాజ్ పరిధిలోని 426 కిలోమీటర్ల రోడ్లపై కనీసం నడవలేని పరిస్థితి నెలకొంది. కుప్పం పట్టణం వీధులంతా దువుు్మతో నిండిపోరుుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top