చావైనా....రేవైనా..


సంతకవిటి(శ్రీకాకుళం జిల్లా): 'చావైనా..రేవైనా..నాతోనే తేలిపోవాలి... ఎక్కడో ఒక మనిషి చనిపోతే కోట్లరూపాయలు వెచ్చిస్తున్నారు. ఇక్కడ కళ్ల ముందే ప్రమాదాలు జరుగుతున్నాయి. గర్బిణీలు, వృద్ధులు, నాలాంటి వికలాంగులు ఇక్కడ వంతెన లేక గతంలో ఉండే చెక్క వంతెన మీద నుంచి వెళ్ళలేక కాలువలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరగుతున్నా కనీసం పుట్‌పాత్ వంతెన కూడా ఎందుకు నిర్మించడంలేదు.. ఉన్న చెక్క వంతెన కూడా కూలీపోయింది. నాకు కుష్టు వ్యాధి ఉంది..నేను జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఇలానే వెళ్లాలి..ఇక్కడ వంతెన లేకపోవడంతో అది కూడా సాధ్యపడదు... చావైనా..రేవైనా..ఈ దీక్షను ఆపను..నా ప్రాణం వంతెన కోసం పోతే..నేతలకు బుద్ది వస్తుంది..అధికారులు అలసత్వం ఆగుతుంది..దయ చేిసి నాకు వైద్యపరీక్షలు వంటివి వద్దు. మద్దతు పలికిన వారందరికీ ధన్యవాదములు. నాకోరిక మన్నించి వంతెనకు ఇక్కడ శంకుస్ధాపన జరిగితేనే నేను లేచేది. గాలి వచ్చినా..వాన వచ్చినా..ప్రళయం..జరిగినా . ఈ పట్టు వదలను. అని గారన్నాయుడుపేట గ్రామానికి చెందిన కూన రాములు నిరాహార దీక్ష ప్రారంభించాడు.




 మంగళవారం నాటికి ఆయన చేపట్టిన దీక్ష నాలుగవ రోజుకు చేరుకుంది.  దీంతో ఆయన ఆరోగ్య పరిస్తితి దిగజారింది. ఆయన కుష్టువ్యాధిగ్రస్తుడుతో పాటు షుగర్ వ్యాధి ఉండడంతో శరీరంసహకరించక కూర్చోలేని పరిస్తితి ఏర్పడింది. చేతులుకు, కాళ్ళుకు చుట్టూ చీమలు, ఈగలు చేరుతున్నాయి. మందులు వాడ కపోవడంతో మనిషి నీరశించడమే కాకుండా చేతులు కాళ్లుబిగుతుగా మారి పరిస్తితి ఆందోళన కరంగా మారింది. నాల్గవరోజు దీక్షకు గారన్నాయుడుపేట గ్రామానికి చెందిన మహిళలు, వృద్దులు, చిన్నారులుతో పాటు పోడలి, చిత్తారిపురం, గుజ్జన్నపేట, పనసపేట, వాల్తేరు, కావలి, జీఎన్‌పురం తదితర గ్రామాలు పలువురు ప్రజలు అక్కడకు చేరుకున్నారు. కూనరాములు దీక్షా శిబిరంలో పాల్గొని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.




సిగ్గులేని ప్రభుత్వం..




దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న రాజాం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కంబాల జోగులు మాట్లాడుతూ కూన రాములు దీక్షకు తాను మద్దతుపలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు సమయంలో కూడా ఇక్కడ వంతెన నిర్మాణం విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం తన వద్ద నిధులు లేవని పేర్కొన్నారు. ప్రస్తుతం అదికార పార్టీ అనవసర ఖర్చులకు నిధులు వెచ్చిస్తుందని, ఇటువంటి సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. తాను జిల్లా కేంద్రానికి వెళ్ళి కలెక్టర్‌తో మాట్లాడి వంతెన నిర్మాణానికి తన వంతు కృషిచేస్తానని అన్నారు. దీక్షా శిబిరంలో నాలుగు గంటలు పాటు కూర్చున్నారు.




ఉద్రిక్తత వాతావరణం..




ఇదిలా ఉండగా అంతకు ముందు దీక్షా శిబిరం వద్దకు రాజాం సీఐ ఎంవీవీ రమణ, సంతకవిటి ఇన్‌చార్జ్ ఎస్‌ఐ జి. భాష్కరరావు, ఏఎస్‌ఐ బీవీ రమణ, సంతకవిటి పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ భార్గవి, నలుగురు ఏఎన్‌ఎంలు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. రాములు ఆరోగ్య పరిస్తితిని సమీక్షించేందుకు డాక్టర్ బార్గవి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో అక్కడ కొద్దిసేపు ఉద్రికత్త వాతావరణం నెలకుంది. గ్రామస్తులు ససేమిరా అనడంతో పోలీసులు వెనక్కుతగ్గడంతో యధా పరిస్తితి నెలకుంది. అనంతరం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు కొంతమంది గ్రామస్తులును తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్ళారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top