ఆది నుంచి వివాదాస్పదమే

ఆది నుంచి వివాదాస్పదమే


అనైతిక రాజకీయాలతో విమర్శల పాలైన అరకు ఎంపీ కొత్తపల్లి గీత తాజాగా ఆర్థిక నేరాల కేసులో  దొరికిపోయారు. బ్యాంకులను బురిడీ కొట్టించిన ఆర్థిక నేరంలో నిందితురాలయ్యారు. ఏకంగా రూ.42.79కోట్ల మేరు బ్యాంకులను మోసం చేయడంతో ఆమెపై సీబీఐ మంగళవారం చార్జిషీట్ నమోదు చేసింది. అనైతిక రాజకీయాలకు పాల్పడి ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కొత్తపల్లి గీత... తాజాగా ఆర్థిక నేరాలకు కూడా పాల్పడ్డారన్న సమాచారం జిల్లాలో చర్చనీయాంశమైంది.

 

- ఇదీ అరకు ఎంపీ గీత తీరు

 - తాజాగా బ్యాంకు మోసం కేసు

 - రూ.42.79కోట్ల మేర బ్యాంకుకు మోసం

 - చార్జిషీట్ నమోదు చేసిన సీబీఐ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
కొత్తపల్లి గీత పంజాబ్ నేషనల్‌బ్యాంకుకు రూ.42.79కోట్ల మేర భారీ నష్టం కలిగించారని సీబీఐ వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ వ్యవహారాలకు సంబంధించి బ్యాం కును మోసగించారని తెలిపిం ది. ఈ కేసులో ఎంపీ కొత్తపల్లి గీతతోపాటు ఆరుగురిపై సీబీఐ మంగళవారం చార్జిషీట్ నమో దు చేసింది. ఆమెతోపాటు విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పి.రామకోటేశ్వరరావుతోపాటు కొందరు బ్యాంకు అధికారులను కూడా నిందితులుగా చేర్చారు. ఎంపీ గీతను

 

ఏ4గా పేర్కొంటూ కేసు పెట్టారు.  ఈమేరకు వారిపై 1988 పీసీ చట్టంలోని సెక్షన్లు 120బి రెడ్‌విత్ 420, 468, 471, 13(2) రెడ్‌విత్ 13(1)(డి)ల కింద చార్జిషీట్ నమోదు చేశారు. ఎంపీ గీత బ్యాంకు అధికారులతో కల సి పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదా పు రూ.25కోట్లు మోసం చేసే కుట్రకు పాల్పడ్డారని అందులో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అనంతరం ఎంపీ గీతతోపాటు ఈ నిందుతులు ఓ వివాదాస్పదమైన ఆస్తికి సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి బ్యాంకు నుంచి రుణా లు తీసుకున్నారు.  



అంతేకాకుండా ఆ రుణమొత్తాన్ని మంజూరైన కార్యకలాపాలకు కాకుండా  నిబంధనలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు వినియోగించారు. ఈ విధంగా ఎంపీ కొత్తపల్లి గీతతోపాటు నిందితులు బ్యాంకును  మొత్తం రూ.42.79కోట్ల మేర మోసం చేశారని సీబీఐ వెల్లడించింది. బ్యాంకులను ఆంత భారీ నష్టం కలిగించడంతోపాటు, ఓ ఎంపీ పాత్ర ఉండటంతో ఈ కేసు విషయంలో సీబీఐ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. ఈ కేసు ప్రాథమిక విచారణను అత్యంత గోప్యంగా ఉంచింది. పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరమే సీబీఐ  చార్జిషీట్ నమోదు చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

 

ఆది నుంచి వివాదాస్పదమే...

అరకు ఎంపీగా ఎన్నికైనప్పటికీ కొత్తపల్లి గీత వైఖరి ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. 2014 ఎన్నికల్లో వైఎ స్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సా ధించిన ఆమె తరువాత అధికార టీడీపీకి సన్నిహితమయ్యారు.  అప్పట్లోనే ఆమె వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.  దీనిపై వైఎస్సార్‌కాంగ్రెస్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేసింది. కొత్తపల్లి గీత తన నామినేషన్ సందర్భంగా కొందరి సంతకాలున ఫోర్జరీ చేశారన్న ఆరోపణ ఎదుర్కొన్నారు. ఆమె కులంపై కూడా వివాదం నెలకొంది.



ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గిరిజన సంఘాలు కొత్తపల్లి గీతపై విమర్శల దాడి చేశాయి. బాక్సైట్ తవ్వకాల కోసమే ఆమె అధికార టీడీపీకి సన్నిహితమయ్యారన్న విమర్శలూ వినిపించాయి. అం దుకు తగ్గట్లుగానే ఆమె బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యలో ఆమె తన నియోజకవర్గంలో పర్యటించడం చాలా వర కు తగ్గించేయడం గమనార్హం. తాజాగా కొత్తపల్లి గీతపై బ్యాంకులను మోసం చేశారని సీబీఐ కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top