ఇక ఆన్‌లైన్‌లో రేషన్ వివరాలు

ఈ-పాస్ మిషన్‌లో చూపిస్తున్న వివరాలు


కాకినాడ సిటీ : జిల్లావ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ప్రక్రియ రిలీజింగ్ ఆర్డర్ (ఆర్‌ఓ) నుంచి లబ్ధిదారుడికి సరకు పంపిణీ చేసే వరకు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రేషన్ షాపుల్లో బయోమెట్రిక్(ఈ-పాస్) అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డిసెంబర్ కోటాకు ఆర్‌ఓలను ఆన్‌లైన్‌లోనే ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు డీలర్లు డీడీ కట్టి, అధికారులు ఆర్‌ఓలను మాన్యువల్‌గా ఇచ్చేవారు. అనంతరం గోదాం నుంచి రేషన్ దుకాణానికి సరకు పంపేవారు.



ఈ క్రమంలో సరకు కొంత పక్కదారి పట్టేదనే ఆరోపణలున్నాయి. కొత్త విధానంలో అందుకు చెక్ పడనుంది. ఆన్‌లైన్‌లో ఆర్‌ఓ విడుదల చేశాక, రేషన్ షాపులో సరకును పరిశీలించి, రూట్ అధికారి అక్కడి ఈ-పాస్‌లో వేలిముద్ర వేస్తారు. దాంతో ఎంత సరకు వచ్చిందో మిషన్‌లో కనిపిస్తుంది. ఇది జిల్లావ్యాప్తంగా అమలు కానుంది. ఈ ప్రక్రియను అధికారులు కాకినాడలోని పలు షాపుల్లో పరిశీలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top