నిస్వార్థ నాయకుడు కాటమరాజు : సారథి

నిస్వార్థ నాయకుడు కాటమరాజు : సారథి - Sakshi


చందర్లపాడు : ఆళ్ల  కాటమరాజును ఆదర్శంగా తీసుకుని నేటితరం నాయకులు ఆయన  ఆశయాల సాధన కోసం కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పశ్చిమ కృష్ణా అధ్య క్షుడు కొలుసు పార్థసారథి సూచించారు. లక్ష్మీపురంలో సోమవారం కాటమరాజు సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన పార్థసారథి మాట్లాడుతూ కాటమరాజు దమ్ము ధైర్యం కలగలసిన నాయకుడని కొని యాడారు. 


తాను ఉయ్యూరు శాసన సభ్యునిగా పనిచేస్తున్న సమయంలో శాసన సభ్యుని కోటాలో గుడిమెట్ల పంచాయతీకి కాలనీ ఇళ్లను మంజూరు చేయించిన ఘనత కాటమరాజుదేనన్నారు. మంత్రి పదవికన్నా, ఎమ్మెల్యే పదవికన్నా సర్పంచి పదవి ఎంతో గొప్పదన్నారు. అందుకు కాటమరాజే నిదర్శనమన్నారు.  

 

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ  25 ఏళ్లపాటు గ్రామ సర్పంచిగా పనిచేయడం మామూలు విషయం కాదన్నారు.  కాగా అంతకుముందు కాటమరాజు విగ్రహాన్ని మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య ఆవిష్క రించారు. పార్థసారథి, రఘువీరారెడ్డి కాటమరాజు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, మొండితోక అరుణ్, బొగ్గవరపు శ్రీశైలవాసు, బొబ్బిళ్లపాటి గోపాలకృష్ణ సాయి,  డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, యాదవ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు లాకా వెగళరావు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి చింకా వీరాంజనేయులు, నందిగామ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బోడపాటి బాబూరావు,  మాజీ ఎమ్మెల్య్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, నందిగామ ఏఎంసీ మాజీ  చైర్మన్ పాలేటి సతీష్, తెలుగుదేశం నాయకులు కోట వీరబాబు, చందర్లపాడు జెడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్, బీసీ నాయకులు దొంతి బోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top