వచ్చారు..వెళ్లారు!

వచ్చారు..వెళ్లారు! - Sakshi


► పలాసలో డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని

► ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై ఆగ్రహం

► ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెళ్లిపోయిన వైనం


కాశీబుగ్గ(పలాస): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు జిల్లా పర్యటన వచ్చారు..వెళ్లారు అన్నట్టుగానే సాగింది. కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్న వారికి ప్రభుత్వం తరఫున  ఏదైనా సాయం ప్రకటిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. శనివారం ఉదయం పలాస చేరుకున్న ఆయన ప్రభుత్వాస్పత్రికి వెళ్లే దారిలో ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శించారు. వైద్యం అందిస్తున్న తీరుని పరిశీలించి యూనిట్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ప్రభు త్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి కామినేని ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ రోగులకు మెరుగై న వైద్య సేవలు అందిస్తామన్నారు. అత్యవస ర పరిస్థితిలో ఉన్న 90 మంది కిడ్నీ రోగులకు కిడ్నీ మార్పిడి జరపాల్సి ఉన్నప్పటికీ.. అంతమందికి కిడ్నీలు తీసుకురాలేమన్నారు. ఈ పరిస్థితిలో డయాలసిస్‌ కేంద్రాలు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఒక్కసారి డయాలసిస్‌ చేసుకుంటే రూ.900 ఖర్చవుతోందని, దాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు.


శివాజీ చలోక్తి..

ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై చలోక్తులు విసిరారు. పలాసకు ఈఎస్‌ఐ ఆస్పత్రి ఇస్తామని గతంలో ప్రకటించిన విషయాన్ని అచ్చెన్న దృష్టికి విలేకరులు తెచ్చారు. దీనికి ఆయన స్పందించి మాట్లాడుతుండగానే శివాజీ కలుగజేసుకొని మంత్రి పదవి పొడిగించారు కదా ఇంకేమీ ఈఎస్‌ఐ ఆస్పత్రి తీసుకొస్తారన్నారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ మూడు వేల మంది కార్మికులు సంతకాలు చేసి ఇవ్వమంటే ఇంతవరకు జీడి పరిశ్రమల యజమానులు, కాష్యూ లేబరు యూనియన్‌ సభ్యులు, కార్మికులు గాని స్పందించలేదని.. లేదంటే ఇప్పటికే ఈఎస్‌ఐ ఆస్పత్రి వచ్చేదన్నారు.


పలాసకు స్టేడియం మంజూరు చేశామని, దాన్ని సమస్యలు లేకుండా నిర్మించుకునే బాధ్యత స్థానిక నాయకులదేనన్నారు. కార్యక్రమంలో శ్రీకాకు ళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్‌ మా ధవ్, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ కోత పూర్ణచంద్రరావు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ గాలి కృష్ణారావు, పీరుకట్ల విఠల్‌రావు, మల్లా శ్రీనివాసరావు, లొడగల కామేశ్వరరావు, శ్రీనివాసరెడి పాల్గొన్నారు.


కిడ్నీ వ్యాధికి కారణాలను అన్వేషిస్తున్నాం

ఉద్దాన ప్రాంతంలో మూత్ర పిండాల వ్యాధులు ప్రబలడానికి కారణాలను అన్వేషిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పారు. పలాస ప్రభుత్వ ఆస ్పత్రిలో ఏర్పాటు చేసిన  డయాలసిస్‌ కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన సందర ్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దానం ప్రాంతంలో లక్ష మందికి వైద ్యపరీక్షలు చేపట ్టగా 13 వేల మందికి కిడ్నీ వ్యాధి సోకినట్లు నిర్ధారణ జరిగిందన్నారు.


వీరిలో 90 మందికి మూత్ర పిండాల మార్పిడి అవసరం ఉన్నట్టు చెప్పారు. జిల్లాలోని శ్రీకాకుళం, పాలకొండ, పలాసలో డయాలసిస్‌ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ నెల 17న సోంపేటలో మరో సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. విశాఖపట్నంలో ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కిడ్నీ వ్యాధికి గల కారణాలను వెల్లడిస్తారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top