జేసీ.. జిల్లా వదిలి వెళ్లిపో!

జేసీ.. జిల్లా వదిలి వెళ్లిపో!


కర్నూలు(అగ్రికల్చర్): ‘‘జాయింట్ కలెక్టర్ హరికిరణ్   వాడుతున్న భాష ఏమాత్రం బాగలేదు. ఆయన జిల్లా నుంచి వదిలి వెళ్లివాలి. పద్ధతి మార్చుకొని క్షమాపణలైనా చెప్పాలి. లేదంటే జిల్లా నుంచి తరిమికొడతాం.’’ అంటూ జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యవహార శైలిపై సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పొదుపు భవన్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు టి.ఎం.డి.హుసేన్ అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.



పలువురు తహశీల్దార్లు, డీటీలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. ‘‘ ప్రస్తుత జేసీ ఐఏఎస్ అధికారి అయినా.. పరుషంగా మాట్లాడుతున్నారు. ఆత్మాభిమానం చంపుకుని విధులు నిర్వహించలేం’’ అని పలువురు రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల రెవెన్యూ డివిజన్ అధికారి(ఆర్‌డీఓ)ను అందరి సమక్షంలో రాస్కెల్, ఇడియట్ అంటూ దూషించడం దారుణమైన విషయమన్నారు. సాయంత్రానికి పని కావడం కష్టం. రేపటికి పని పూర్తి చేస్తామంటే..‘‘రాస్కెల్..ఇడియట్.. నాకే ఎదురు చెబుతావా..నోరు తెరిస్తే నా చేయి లేస్తుంది.. బూటు కూడా లేస్తుంది’’ అని జేసీ దూషించడం తగదన్నారు. డీఎస్‌ఓను బూటు కింద వేసి తొక్కుతాను అంటూ దూషించడం దారుణమన్నారు.



గతంలో ఎంతోమంది జేసీలు, కలెక్టర్లు పనిచేశారని, వారు రెవెన్యూ ఉద్యోగులతో బాగా పనిచేయించుకున్నారన్నారు. అయితే ప్రస్తుత జేసీ నియంతలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యూ అసోసియేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్న అండగా నిలుస్తామంటూ పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. మంత్రాలయం, కోసిగి తహశీల్దార్లను బదిలీ చేయడం, ఐదుగురు వీఆర్వోలను సస్పెండ్ చేయడం దారుణమని, తక్షణం తహశీల్దార్లకు అక్కడే పోస్టింగ్ ఇవ్వాలని, వీఆర్వోల సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.



జిల్లా అధ్యక్షుడు టి.ఎం.డి.హుసేన్ మాట్లాడుతూ..‘‘ జేసీ వ్యవహారాన్ని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ దృష్టికి తీసుకుపోదాం.. ఆ యన ఏమి చెబుతారో తెలుసుకుని తర్వాత భవిష్యత్తు ప్రణాళి కను రూ పొందించుకుందాం’’అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి రా మన్న, అ సోసియేట్ అధ్యక్షుడు ఆదినారాయణ, కోశాధికారి వేణుగోపాల్, కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు రాజశేఖర్ బాబు, సుబ్బరాయుడు, రజనీకాంత్‌రెడ్డి, ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top