జల్సాల కోసమే చైన్‌స్నాచింగ్‌లు

జల్సాల కోసమే చైన్‌స్నాచింగ్‌లు - Sakshi


అనంతపురం సిటీ: జులాయిగా తిరుగుతూ జల్సాల కోసం చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.18 లక్షలు ఉండవచ్చుని నిర్థారించారు. అ నంతపురం వన్‌టౌన్ పరిధిలో పట్టుబడి న ఈ నలుగురిని ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదివారం విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు.



ఎస్పీ రాజశేఖర్‌బాబు కథనం ప్రకా రం.. నగరంలో గిరిప్రసాద్‌కాలనీకి చెంది న పాముల మోహన్(28), పాములసూరి(24), పాముల సుధాకర్ అలియాస్ ధూళి (25), రాణినగర్‌కు చెందిన షేక్‌నూర్ బాషా అలియాస్ మున్నా (23) నలుగురు బృందంగా ఏర్పడ్డారు. వీరు ఇద్దరు ఇద్దరు చొప్పున ఒంటరిగా వెళ్లే శివా రు ప్రాంతాల మహిళలు, ఇళ్ల ముందు కసువు ఊడ్చేమహిళలను టార్గెట్ చేసి పగలు, రాత్రి తేడా లేకుండా అదను చూసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యేవారు.



కొన్ని నేరాల్లో ద్విచక్రవాహనాలను వినియోగించి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. అలాగే బస్టాండు, బస్సుల్లో  జేబు దొంగతనాలకు పూనుకున్నారు. ఇలా ఏడాది కాలంగా తాడిపత్రి జిల్లా కేంద్రంలోని తాడిపత్రి బస్టాండు, హౌసింగ్ బోర్డు, ఎంఐజీకాలనీ, పాతూరు కూరగాయల మార్కెట్, అశోక్‌నగర్, రాణినగర్, వేణుగోపాల్‌నగర్, భైరవనగర్, సంఘమేష్‌నగర్, కురబవీధి, గుత్తి రోడ్డు, శ్రీకంఠం సర్కిల్ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వీటితో పాటు కదిరి పట్టణంలో ఒక నేరం చేశారు.



 ఒక దొంగ-ఒక పోలీస్ నినాదంతో నిందితుల ఆటకట్టు..

 జిల్లాలో ఇటీవల జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ఎస్పీ ఆదేశాలతో ఒక దొంగ-ఒక పోలీస్ నినాదంతో కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగానే అనంతపురం డీఎస్పీ మల్లికార్జునశర్మ పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ గోరంట్లమాధవ్, ఎస్‌ఐలు విశ్వనాధ్‌చౌదరి, జకీర్‌హుస్సేన్, ఏఎస్‌ఐ ప్రవీణ్, హెడ్‌కానిస్టేబుళ్లు నాగరాజు, సూర్యనారాయణ, షెక్షావలి, రాజకుళ్లాయప్ప, వెంకటేష్, సుధాకర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు రమేష్, ప్రసాద్, ధనుంజయ, రాజేష్, పోతన్న, భీమేష్, నాగార్జున, గిరి, రామస్వామి, బాలాజీనాయక్, హోంగార్డులు పీరా, నాగభూషణం ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా ఉంచారు. సీఐ గోరంట్ల మాధవ్‌కు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఇద్దరిని స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలో, మిగిలిన ఇద్దరిని శివకోటిదేవాలయం సమీపంలో అరెస్ట్ చేశారు.



 సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు : చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పక్కా సమాచారంతో పట్టుకుని వారి నుంచి రూ.18లక్షలు విలువ చేసే 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న వన్‌టౌన్ సీఐ, ఎస్‌ఐల బృందాన్ని ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top