ఈయన జగ్గారెడ్డి...మరి ఈయనో..?

ఈయన జగ్గారెడ్డి...మరి ఈయనో..?


ఎడమ పక్కన నిండుగా గడ్డంతో, పెరిగిన జుట్టుతో ఉన్నదెవరో తెలుసా..? ఆ ఏముంది.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆ మాత్రం గుర్తుపట్టలేమా అంటారేమో? మరి కుడివైపు చిత్రంలో ఉన్నదెవరో చెప్పగలరా..? కాసేపు చూసి, కాస్త ఆలోచించాల్సిందే కదా! ఈ చిత్రంలో ఉన్నది కూడా ఆయనే. తెలంగాణ రాజకీయ నాయకుల్లో తనదైన స్టైల్‌ను అనుసరించే జగ్గారెడ్డి.. ఇలా మీసాలు, గడ్డం లేకుండా కొత్త రూపులో కనిపించేసరికి గుర్తుపట్టడం కష్టమే! తిరుమలలో శ్రీవారికి ఆయన తలనీలాలు సమర్పించుకోవడానికి ముందు, తర్వాత తీసిన చిత్రాలివి.



ఆదివారం రాత్రి తన మిత్రులతో కలిసి తిరుమల వచ్చిన జగ్గారెడ్డి సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తలనీలాలు సమర్పించారు. తన మిత్రులే గుర్తు పట్టలేని విధంగా ఇలా కనిపించారు. ఎలాంటి మొక్కులూ లేకుండానే వెంకన్నకు తలనీలాలు ఇవ్వాలని అనుకున్నానని.. ఎన్నో రోజులుగా రావాలనుకున్నా ఇప్పటికి కుదిరిందని జగ్గారెడ్డి చెప్పారు. మిమ్మల్ని ఇలా మీసం, గడ్డం లేకుండా మీ నియోజవర్గంలో గుర్తు పడతారా? అంటే.. ‘అవును .. గుర్తుపట్టలేరేమో’ అని నవ్వుతూ అన్నారు.     

 - సాక్షి, తిరుమల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top