‘విభజన’లో ఆస్తుల వాటా కోసం పోరు


ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలివే..



సాక్షి, అమరావతి: విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటా కోసం రాజీలేని పోరాటం కొనసాగించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మంత్రులు యనమల, కాల్వ శ్రీనివాసులు, అచ్చె న్నాయుడులతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఢిల్లీకి వెళ్లి హోం శాఖ మంత్రి రాజనాథ్‌సిం గ్‌ను కలసి ఏపీకి  దక్కాల్సిన ఆస్తులపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. అనావృష్టి తో నష్టపోతున్న రైతుల్ని ఆదుకునేందుకు ఈ ఏడాది ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలనే నిర్ణయాన్ని ఆమోదించారు. వాణిజ్య పంటలైన మిర్చి, పసుపు తదితరాల ధరల్లో హెచ్చు తగ్గులపై నిపుణులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.



అలాగే రూ. 24 వేల కోట్లతో నిర్మించే అనంతపురం– అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే గురించి చర్చిం చారు. ఇక్కడ అటవీ భూముల సేకరణకు 60 మందితో ప్రత్యేక భూ సేకరణ విభాగం ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ  జరిగింది.ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో లోకేశ్‌పై జరుగుతున్న వ్యక్తిగత ప్రచారానికి కేసు పెట్టలేదని, శాసన మండలిని కించపరి చారని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.



► మే 1 నుంచి 31 వరకు సాధారణ బదిలీలు. ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి జాబితా, ఐటీడీఏ పరిధిలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారి వివరాలను మే 5 లోగా అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధం చేయాలి. కౌన్సిలింగ్‌ ప్రక్రియ మే 18 మొదలు పెట్టి మే 28లోగా పూర్తి చేయాలి.

► తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద ఆస్పత్రిలో 8 మంది మెడికల్‌ అధికారుల నియామకానికి అనుమతితో పాటు టీటీడీలో ఏపీఆర్వో పోస్టు మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌. ఈ పోస్టు నియామకానికి ఏడాదికి రూ. 7.92 లక్షల భారంపై సమీక్ష.



రాజధాని డిజైన్లపై పెదవి విరుపు

రాజధాని పరిపాలనా నగరం డిజైన్లపై మంత్రివర్గ సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కేబినెట్‌లో ఈ డిజైన్లపై చర్చ జరిగింది.సమావేశంలో సీఆర్‌డీఏ అధికారు లు రాజధాని పరిపాలనా నగరం మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ అయిన లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దీనిపై ప్రచారం చేసిన స్థాయిలో డిజైన్లు లేవని అధికులు పెదవి విరిచినట్లు తెలిసింది.  మరికొన్ని మార్పులు చేద్దామని, రెండు, మూడుసార్లు కూర్చుని ఆలోచిద్దామని సీఎం తెలిపారు. సోషల్‌ మీడియా నియంత్రణకు తీసుకున్న చర్యలపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రా యపడ్డారు.ప్రభుత్వం, సీఎం, ముఖ్య నేతలపై ప్రచారంలోకి వచ్చే సెటైర్లన్నీ వైఎస్సార్‌సీపీ, సాక్షి మీడియానే చేయిస్తోందని ఎదురు దాడి చేయాలని, అలా చేయడం ద్వారా తప్పించుకునేలా చూడాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top