జగన్ దృష్టికి జిల్లా సమస్యలు

జగన్ దృష్టికి జిల్లా సమస్యలు - Sakshi


విన్నవించిన పార్టీ నేతలు, విద్యార్థి నాయకులు

 

విశాఖపట్నం: నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఇక్కడికి వచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రభుత్వ అతిథి గృహం వద్ద జిల్లా, నగర పార్టీనాయకులు ఘనస్వాగతం పలికారు. జిల్లాలో రైతులు, డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలులో చూపుతున్న పక్షపాత వైఖరిని తెలియజేశారు. హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న పేదలకు ఇంతవరకూ ఎ లాంటి నష్టపరిహారం ఇవ్వలేదని, తు పాను వల్ల పేదలు, రైతులు ఇబ్బందు లు పడుతుంటే టీడీపీ నేతలు మరింత సొమ్ము చేసుకోవాలని ఉద్దేశంతోనే వి శాఖ ఉత్సవ్ నిర్వహించారని చెప్పారు.  జిల్లాకు సంబంధించిన పలు సమస్యలపై అధినేత దృష్టికి తీసుకెళ్లారు.

 

 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి



 రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 15 వేల ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఏయూ రీసెర్చ్ స్కాలర్ ఫోరం కన్వీనర్ సురేశ్‌మీనన్ కోరారు. ఈ మేరకు ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

 

స్కాలర్‌షిప్‌ల్లో విద్యార్థులకు తీవ్ర అన్యాయం




ప్రభుత్వం కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేస్తున్న స్కాలర్‌షిప్‌ల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని జగన్‌కు వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ యూనియన్ సభ్యులు వివరించారు. జగన్‌ను యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.కాంతారావు నేతృత్వంలో పలువురు ఏయూ విద్యార్థులు కలిసి తమ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి న్యాయం చేయాలని కోరారు.



బాక్సైట్‌పై ప్రేమతోనే సీఎం అరకు దత్తత



ఏజెన్సీలో ఉన్న బాక్సైట్‌పై ప్రేమతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారని జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ నేతలు శెట్టి అప్పాలు, సమర్డి రఘునాథ్, శెట్టి ఆనంద్ వివరించారు. రా ష్ట్రంలో ఇన్ని గ్రామాలుండగా కేవలం అ రకు గ్రామాన్నే ఆయన దత్తత తీసుకోవడంపై వారు అనుమానం వ్యక్తం చే శారు. అరకు నియోజకవర్గంలో ప్రజ లు కలుషిత నీరు తాగి రోగాలతో ఇ బ్బందులు పడుతుంటే కనీసం తాగునీ రు ఏర్పాటు చేయలేని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top