అప్పీలుకు వెళ్లనున్న ఐపీఎస్‌లు?

అప్పీలుకు వెళ్లనున్న ఐపీఎస్‌లు? - Sakshi


కేటాయింపులపై రుసరుసలు 

తెలంగాణలోనే ఆరుగురు డీజీపీ స్థాయి ఆఫీసర్లు


 

  హైదరాబాద్: తాము కోరిన రాష్ట్రానికి తవును కేటారుుంచలేదని అసంతృప్తికి గురైన కొందరు పోలీసు అధికారులు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 29 వరకు అప్పీలుకు వెళ్లేందుకు గడువు ఇవ్వడంతో అధికారులు ఈ విషయుంలో సన్నాహాలు ప్రారంభించారని తెలుస్తోంది. కాగా  అదనపు డీజీ సురేంద్రబాబు, అనురాధలు స్పౌజ్ కాజ్‌తో ఇరువురు కూడా ఇటు తెలంగాణ లేదా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  కేడర్లలో ఏదో ఒక రాష్ట్రానికి కేటాయించాలని  కోరే అవకాశవుుంది.  భార్యాభర్తలైన  ఇద్దరు అదనపు డీజీ స్థాయి అధికారులు  ఎన్.వి.సురేంద్ర బాబు, ఏఆర్ అనురాధలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆప్షన్ ఇచ్చారు. అయితే కేటాయింపుల్లో మాత్రం సురేంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, అనురాధ తెలంగాణ కేడర్‌కు ఎంపిక చేశారు. అలాగే   ఇద్దరు ఐపీఎస్ సోదరులు, రాష్ట్ర మాజీ డీజీపీ ఎ.కె. మహంతి కుమారులిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆప్షన్  ఇవ్వగా అవినాష్  తెలంగాణకు, అభిషేక్ ఏపీకి ఎంపికయ్యారు.



అంతేగాకుండా తాత్కాలిక కేటాయింపుల్లో  భాగంగా తెలంగాణలో  వివిధ హోదాల్లో  పనిచేస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులు  ఈ  రాష్ట్రానికే  తమ ఆప్షన్ ఇవ్వగా  వారిలో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. రెండు రాష్ట్రాలకు జరిపిన కేటాయింపుల్లో  ఆరుగురు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) స్థాయి  అధికారులను తెలంగాణకు కేటాయించారు. రాష్ట్రానికి అవసరమైన మేరకు ఇద్దరు  డీజీపీలు కేడర్  ర్యాంకులో, మరో ఇద్దరు నాన్ కేడర్ ర్యాంకులో డీజీపీలు ఉండాలని భావిస్తుండగా, ఈ సంఖ్య కంటే  ఇద్దరు డీజీపీలు ఎక్కువగా ఉన్నారని  ఐపీఎస్ వర్గాలు పేర్కొన్నాయి.



రోస్టర్ బ్యాండ్‌పై ఐపీఎస్‌ల అసహనం



రాష్ట్ర విభజనతో అనివార్యమైన అఖిల భారత సర్వీసు అధికారుల పంపకానికి కేంద్రం చేపట్టిన రోస్టర్ బ్యాండ్ విధానంపై పలువురు ఐపీఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ మారడంతో తమ స్థానాలు మారిపోయాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పౌస్ గ్రౌండ్‌కు ప్రామాణికతను సైతం ఎక్కడా పేర్కొనకపోవడంపైనా విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాలపై కమిటీకి అభ్యంతరం తెలపాలని అధికారులు నిర్ణయించారు. రోస్టర్ పాయింట్స్ మారడంతో తాము వెళ్లాల్సిన రాష్ట్రానికి కాకుండా వేరే దానికి వెళ్లామని అధికారులు వాపోతున్నారు. రెండు రాష్ట్రాలకూ అధికారుల్ని కేటాయించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ వీటిపై అభ్యంతరాలు తెలపడానికి ఈ నెల 29 సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. దీంతో పలువురు అధికారులు తమ అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top