పీలేరులో 92 లక్షలకు చిట్స్ వ్యాపారి ఐపీ


పీలేరురూరల్, న్యూస్‌లైన్: పీలేరు పట్టణంలోని గాంధీ రోడ్డులో కాపురం ఉంటున్న షేక్ సభీకుల్ భార్య షేక్ ఫర్వీన్ రూ. 92,21,000కు స్థానికి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఐపీ దాఖలు చేసింది. ఫర్వీన్ 12 ఏళ్లుగా పీలేరులో చిట్స్ నిర్వహిస్తోంది. వ్యాపారం అభివృద్ధి కోసం 27 మంది వద్ద అప్పు చేసింది.



చిట్స్ ఎత్తిన వారు సక్రమంగా తిరిగి చెల్లించకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు అధికమవడంతో తిరిగి చెల్లించలేని స్థితిలో ఐపీ దాఖలు చేసినట్లు ఆమె పిటిషన్లో పేర్కొంది. తనకు రూ. వెయ్యి విలువచేసే రెండు పంజాబీ డ్రెస్స్‌లు, రెండు చీరలు, రెండు జాకెట్లు, రెండు పెట్టీకోట్స్ తప్ప ఎలాంటి ఆస్తులు లేవని తెలిపింది.ఫర్వీన్‌కు అప్పు ఇచ్చిన వారిలో ఇద్దరు కడపకు చెందిన వారు, ఒకరు తిరుపతికి చెందిన వారు కాగా 24 మంది పీలేరుకు చెందిన వారే.

 

రూ. 1.92 లక్షలకు కలకడవాసి ఐపీ...

 

కలకడ మండలం నడిమిచెర్ల పంచాయతీ కొత్తపల్లెకు చెందిన బుర్రా రామచంద్ర రూ. 1,92,809కు స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఐపీ దాఖలు చేశాడు. రామచంద్ర టమాట వ్యాపారం చేసి జీవనం సాగించేవాడు. టమాట వ్యాపారం తోపాటు ట్రాక్టర్ లీజుకు తీసుకుని వ్యాపారం చేసేవాడు. వ్యాపారం నిమిత్తం నడిమిచెర్ల గ్రామానికి చెందిన నలుగురి వద్ద రూ. 1,92,809 అప్పు చేశాడు. వ్యాపారంలో నష్టం రావడం, వడ్డీలు పెరిగిపోవడంతో అప్పు తిరిగి చెల్లించలేక ఐపీ దాఖలు చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నాడు. తన వద్ద రూ. 900 విలువ చేసే మూడు షర్టులు, ప్యాంట్స్, రెండు లుంగీలు తప్ప ఎలాంటి ఆస్తులు లేవని పేర్కొన్నాడు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top