చదువు కొనాల్సిందే..

చదువు కొనాల్సిందే.. - Sakshi


నెల్లూరు (టౌన్‌): కొత్త విద్యాసంవత్సరం విద్యార్ధులకు పుస్తకాల భారం, తల్లి,దండ్రులకు ఫీజుల భారంతో స్వాగతం పలుకుతొంది. ఐఐటి, నీట్, ఒలంపియాడ్, టెక్నొ, ఈటెక్నో తదితర పేర్లుతో కార్పోరేట్‌ విద్యాసంస్ధలు చెలరేగి పోతున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యార్ధుల నుంచి అధికరూపంలో ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతి ఏటా కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాల నుంచి అందే మామూళ్లు కారణంగానే విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.



ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాఠశాలల్లో ఫీజుల పట్టిక ప్రదర్శించాల్సి ఉన్నా ఎక్కడా కానరాని పరిస్ధితి నెలకొంది. ఫీజుల పట్టిక విషయంపై ఒకరిద్దరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ప్రవేశాలు లేవంటూ యాజమాన్యాలు పంపించి వేస్తున్నాయి. పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటి ఊసే ఎక్కడా కనిపించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్ధుల తల్లి,దండ్రులు నిలువు దోపిడికి గురివుతున్నారు. పిల్లల భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రుల ఆరాటాన్ని కార్పోరేట్‌ యాజమన్యాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి.



ప్రభుత్వ అధికారుల లెక్కలు ప్రకారం జిల్లాలో 904 కార్పోరేట్, ప్రవేటు పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 327 ప్రాధమిక, 231 ప్రాధమికోన్నత, 346 ఉన్నత పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో మొత్తం 1,56,004 మంది విద్యార్ధులు చదువుకున్నారు. అయితే జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా మరో 500 కార్పోరేట్‌ పాఠశాలలు ఉంటాయని విద్యాశాఖలో పనిచేసే అధికారులు చెబుతున్నారు. వీరంతా కార్పోరేట్, ప్రవేటు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రతి ఏటా భారీగా ఫీజులు చెల్లించి విద్యను అభ్యసిస్తున్నారు.



ఎల్‌కేజి నుంచి 5 వ తరగతి వరకు రూ.15 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అదే 6 వ తరగతి నుంచి పదవ తరగతి వరకు రూ. 45 వేల నుంచి 1.75 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కార్పోరేట్‌ యాజమాన్యం వసూళ్లుకు పాల్పడుతున్నా విద్యాశాఖ అధికారులు గాని, ఇటు ఉన్నతాధికారులు గాని నొరెత్తడం లేదు. అధికార పార్టికి చెందిన మంత్రి విద్యా సంస్ధలు ఉండటం వల్లే ఎంత ఫీజులు వసూళ్లు చేస్తున్నా అధికారులు మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.



కార్పోరేట్‌ పేరుతో రూ.500 కోట్లు వ్యాపారం...

తమ బిడ్డలు ఉన్నత స్ధాయిలో చూడాలన్న తల్లి,దండ్రుల ఆశలను కార్పోరేట్‌ విద్యా సంస్ధలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఐఐటి, నీట్, టెక్నో, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈటెక్నో, తదితర పేర్లు పెట్టి భారీ మొత్తంలో ఫీజుల రూపంలో గుంజుతున్నారు. నగరంలో ఎల్‌కేజికి రూ.లక్ష ఫీజు ఉన్న కార్పోరేట్‌ స్కూల్స్‌ 6వరకు ఉన్నాయి. మిగిలిన పాఠశాలలు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. అదే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.20 వేల నుంచి రూ. 1.5 లక్షలు వరకు ఫీజులు రూపంలో దోపిడికి పాల్పడుతున్నారు.



ఈ లెక్కన జిల్లాలో కార్పోరేట్, ప్రవేటు పాఠశాలలు ప్రతి ఏటా సుమారు రూ.500 కోట్లుకు పైగా వ్యాపారం జరుగుతున్నట్లు పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు. చిన్న, పెద్ద పాఠశాలలు అనే తేడా లేకుండా ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాం, ౖటñ , బూట్లు, తదితర విద్యా సామాగ్రిని కూడా తమ పాఠశాలల్లోనే అధిక« ధరలకు విక్రయించి బహిరంగ దోపిడికి పాల్పడుతున్నారు. స్కూలు ఫీజులతో సంబంధం లేకుండా బస్సు ఫీజు అదనంగా వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి 5కిలో మీటర్లు లోపు ఏడాదికి రూ.6వేల నుంచి రూ.12వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇంత దోపిడికి పాల్పడుతున్నా విద్యాశాఖ అధికారులు గాని, జిల్లా ఉన్నతాధికారులు గాని కళ్లుప్పగించి చూడటం వారివంతుగా మారింది.


క్యాషే ముద్దు చెక్కు వద్దు ...

కేంద్ర ప్రభుత్వం బ్యాంకు లావాదేవీలను కఠిన తరం చేయడంతో విద్యా సంస్ధల యాజమాన్యం కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ఫీజులు చెల్లించే సమయంలో నగదు లేదా ఏటీఎం కార్డును తీసుకు రావాలని తల్లి,దండ్రులకు సూచిస్తున్నారు. చెక్కులు అయితే ప్రతి లావాదేవి అకౌంట్‌బుల్‌ అవుతుంది. దీంతో ఇన్‌కం టాక్స్‌ అధికారులు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. వీలున్నంత వరకు నగదు, ఏటీఎం కార్డులు తీసుకు రావాలని చెబుతున్నారు. తప్పదని భావిస్తే తప్ప చెక్కును తీసుకోవడం లేదు.



కార్పోరేట్‌కు పట్టని ప్రభుత్వ ఉత్తర్వులు

2008లో జారీ అయిన ఉత్తర్కూలు ప్రకారం ఫీజులు నిర్ణయించేందుకు డీఈఓ, జిల్లా ఆడిట్‌ అధికారి, స్వఛ్చంధ స్వంఛ్చంధ సంస్ధ లేదా తల్లి,దండ్రుల కమిటీ ప్రతినిధితో కూడిన కమిటీని కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియమించాల్సి ఉంది. ఈ కమిటీ పాఠశాల మౌళిక సదుపాయాలు, పరిస్ధితులను పరిశీలించిన పదిప ఫీజు ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తుంది. పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, సమదుస్తులు విక్రయించరాదు. యాజమాన్యం సూచించే ప్రాంతాల్లో కొనాలన్న నిబంధన లేదు. వీటి అమ్మకాలను పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకూడదు. పరీక్ష ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శనలో ఉంచాలని ఆదేశించారు. పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఇటెక్నో, ఈశాస్త్ర తదితర పేర్లును రాయకూడదు. కేవలం పాఠశాల అని మాత్రమే రాయాల్సి ఉంది.



ఫీజులను నోటీసు బోర్డులో పెట్టాలి, రామలింగం, డీఈఓ

కార్పోరేట్‌ పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఆయా డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు స్కూల్స్‌ ఫీజులపై పర్యవేక్షించాలి. తల్లి,దండ్రులు, స్కూల్‌ ప్రిన్సిపాల్, ఛైర్మన్‌ల ఆధ్వర్యంలో నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. ఎక్కువ ఫీజులు వసూళ్లు చేస్తే తన దృష్టికి తీసుకురావాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top