'సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేం'

'సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేం' - Sakshi


హైదరాబాద్: శేషాచలంలో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ పై విచారణ మూడు వారాల్లో పూర్తి చేయాలని సిట్ ను హైకోర్టు  ఆదేశించింది. ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఎన్కౌంటర్పై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది.



ఈ కేసులో భాగంగా సిట్ ముగ్గురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను హైకోర్టుకు సమర్పించింది. గతవారం దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. శేషాచలం ఎన్కౌంటర్ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. దాంతో హైకోర్టు కల్పించుకుని ఈ కేసును సీబీఐకి అప్పగించలేమని తేల్చి చెప్పింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top