సత్తా చాటిన ‘తూర్పు’

సత్తా చాటిన ‘తూర్పు’


కాకినాడస్పోర్ట్స్/పెదపూడి: అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీల్లో తూర్పుగోదావరి జట్లు విజయకేతనం ఎగరేసి సత్తా చాటాయి. అండర్ 14 బాలురు, బాలికల విభాగాల్లో, అండర్ 17 బాలుర విభాగంలో తూర్పుగోదావరి క్రీడాకారులు ప్రథమ స్థానంలో నిలిచారు. గొల్లలమామిడాడలోని డీఎల్‌ఆర్ లక్ష్మణరెడ్డి కళాశాల ప్రాంగణంలో 60వ అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలు సోమవారం రాత్రి అట్టహాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నెక్ సంఘం అధ్యక్షుడు పడాల సుబ్బారెడ్డి, గౌరవ అతిథిగా కాకినాడ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.



ఈ కార్యక్రమానికి డీఎల్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌వీఆర్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.  పోటీల రాష్ట్ర పరిశీలకుడు కృష్ణారెడ్డి, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు గోవిందరాజులు, మాజీ అధ్యక్షుడు పి.శ్రీరామచంద్రమూర్తి, పాఠశాల అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి టీవీఎస్ రంగారావు, పోటీల నిర్వహణా కమిటీ సభ్యులు అప్పారెడ్డి, పీడీలు గంగాధర్,  బంగార్రాజు, రాజశేఖర్, శ్రీనివాసు, పట్టాభి,పీఈటీ అప్పారెడ్డి, శ్రీనివాసు రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శివాజి, మండ రాజారెడ్డి, చైతన్య బ్యాంకర్స్ సత్తిరెడ్డి, ప్రత్యూష మురళి, పి.రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.

 

విజేతల వివరాలు

అండర్-14 బాలుర విభాగంలో తూర్పు, గుంటూరు, కృష్ణా జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో తూర్పుగోదావరి, అనంతపురం, పశ్చిమ గోదావరి జట్లు మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

 అండర్-17 బాలుర విభాగంలో తూర్పు, కృష్ణా, చిత్తూరు జట్లు, బాలికల విభాగంలో గుంటూరు, పశ్చిమ, చిత్తూరు జట్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. జాతీయ స్థాయికి ఎంపికైన బాస్కెట్‌బాల్ క్రీడాకారుల వివరాలను టోర్నమెంట్ పరిశీలకుడు కృష్ణారెడ్డి సోమవారం రాత్రి  వెల్లడించారు. అండర్-14 విభాగం జాతీయ స్థాయి పోటీలు రాజస్థాన్‌లోని గూటాన్‌లో నవంబర్ 1 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు. అండర్-17 విభాగం పోటీలు విశాఖలో డిసెంబర్ మొదటి వారంలో జరుగుతాయని తెలిపారు.  

 

జాతీయ స్థాయికి ఎంపికైన జట్ల సభ్యులు

అండర్-14 బాలుర విభాగం :  ఎ.సాయిపవన్‌కుమార్, ఎం.డి.గౌష్, వి.ఆర్.ఆర్.మణికంఠరెడ్డి, హేమంత్, ఎస్.వి.అమీర్, సాయి కమల్‌కాత్, సి.హెచ్.శేఖర్, ఎస్.కె.సాయి, అరవింద్, అమృతరాజ్, ఆనంద్, సాయినిఖిల్.

 బాలికల విభాగం : పి.సుస్మిత, జహీరా సుల్తాన్, జాస్మిన్, ఆదమ్మ, హరిత, మంజుల, వైష్ణవి, సత్యవతి, సిందు, వి.లక్ష్మి, సంధ్య, విద్యఅనూష.

 

అండర్-17 బాలుర విభాగం: వి.నాగదుర్గాప్రసాద్, ఎం.మణికంఠ, కె.అభినాష్, ఏవీ సుబ్రహ్మణ్యం, చాన్ బాషా, శ్రీకర్, నిఖిల్‌చౌదరి, ప్రవీణ్‌కుమార్, ఎన్.వెంకట కృష్ణారెడ్డి, టి.కృష్ణారెడ్డి, సాగర్, సి.హెచ్.వెంకటసాయి.

 బాలికల విభాగం: వై.యమ్మలక్ష్మి, ఉమామహేశ్వరి, చాందిని, పద్మావతి, నందిని, అమృత, తేజశ్విని, శ్వేత, డి.పూర్ణ, దివ్యభారతి, పద్మావతి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top