ఇన్‌స్పైర్‌లో.. రెండోరోజూ తిప్పలే!


తిరుచానూరు: అధికారుల తీరు మారలేదు. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోలేదు. దీంతో రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌కు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు రెండోరోజూ తిప్పలు తప్పలేదు. జిల్లాస్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన 502 నమూనాలతో ఏడు జిల్లాల నుంచి దాదాపు వెయ్యిమందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరుపతికి వచ్చారు. వీరికి తిరుచానూరు రోడ్డులోని శ్రీనివాస కల్యాణ మండపంలో ఉన్న 3 సత్రాల్లో వసతి ఏర్పాటుచేశా రు. సత్రాల్లో వీరికి సరిపడా బాత్‌రూంలు, టాయ్‌లెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.



తెల్లవారుజామున 3 గంటలకే క్యూలో నిలబడితే ఉదయం 6 గంటలకు స్నానం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎగ్జిబిషన్‌కు సకాలంలో రాలేకపోతున్నామని, మరికొందరు జ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద యం, రాత్రివేళ ఇక్కడ అందిస్తున్న అల్పాహారం నా ణ్యత లేదని, తినడానికి ఏమాత్రం అనువుగా లేదని వాపోతున్నారు. మధ్యాహ్నం అందించే భోజనం సైతం రుచి, శుచి లేదన్నారు. పైగా తిండికి లేక ఇక్కడికి వచ్చినట్లు వడ్డించే వారు కసురుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. భోజనం కోసం గంటల తరబడి ఎండలోనే నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

 

చీకటి గదుల్లోనే నమూనాలు



రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్‌ను విశాలమైన గదుల్లో ఏర్పాటుచేయాల్సి ఉంది. విద్యుత్ సరఫరా నిరంతరం ఉం డేలా చూడాల్సి ఉంది. ఇవేమీ లేకుండా ఇరుకైన చీకటి గదుల్లో ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చిన విద్యార్థులు నమూనాలను తిలకించలేకపోయారు. విద్యార్థులు అధికసంఖ్యలో రావడంతో నమూనాలను తిలకించేలోపే వారిని పంపించివేస్తున్నారు.

 

ప్రమాదం జరిగితే...



వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. సందర్శనకు వేలాది సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. ఇలాంటప్పుడు ఆంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. నిర్వాహకులు వీటిని ఏర్పాటుచేయకపోవడం చర్చనీయాంశమయింది. అనుకోని ప్రమాదం సంభవిస్తే ఎలా అని అక్కడికి వచ్చిన వారు ప్రశ్నిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top