‘కేర్’అధినేత డాక్టర్ సోమరాజుకు జాతీయ అవార్డు
సిటీబ్యూరో: ‘ఇండియాస్ మోస్ట్ అడ్మైర్డ్ కార్డియాలజిస్ట్’ అవార్డుకు కేర్ గ్రూప్ హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ బి.సోమరాజు ఎంపికయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా అఫైర్స్ ఆఫ్ బిజినెస్ లీడర్షిప్-2014 సదస్సులో ఆయనకు ఈ అవార్డును బహూకరించారు. 1997లో ప్రారంభమైన కేర్ ఆసుపత్రి ప్రస్థానం ఇప్పుడు 13 శాఖలుగా విస్తరించింది. దేశవ్యాప్తంగా రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకుగాను డాక్టర్ సోమరాజును ఇండియాస్ మోస్ట్ అడ్మైర్డ్ కార్డియాలజిస్ట్ అవార్డుతో సత్కరించారు.