సీఏలు వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి

సీఏలు వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి - Sakshi


- నగదు రహితమే మేలు

- జనవరి 1 తర్వాత అద్భుత ఫలితాలు

- సీఏల సదస్సులో కెనరా బ్యాంక్ చైర్మన్ మనోహరన్

 

 యూనివర్సిటీ క్యాంపస్: దేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ)లు తమ వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కెనరా బ్యాంక్ చైర్మన్ టీఎన్ మనోహరన్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో మంగళవారం సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్(ఎస్‌ఐఆర్‌సీ) 48వ వార్షిక సదస్సును మనోహరన్ ప్రారంభిం చారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌం టెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తిరుపతి బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మనోహరన్ మాట్లాడుతూ సీఏలు నిరంతరం తమను తాము అప్‌డేట్ చేసు కోవాలని, రోజురోజుకు వస్తున్న కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాని సూచించారు. అప్పుడే వృత్తిలో రాణించగలరన్నారు.



  సీఏ కోర్సులను ఎంచుకొనే విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టి చదివినప్పుడే కోర్సు పూర్తి చేయగలరన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు, పెద్దనోట్ల రద్దువల్ల దేశానికి మేలు కలుగుతుందన్నారు. పెద్దనోట్ల రద్దు ఫలితంగా సమస్యలు రావటం, సామాన్యులకు ఇబ్బందులున్నప్ప టికీ డిసెంబర్ 30 తర్వాత దీని ఫలితాలు తెలుస్తాయన్నారు. ఐసీఏఐ చైర్మన్ దేవరాజా రెడ్డి మాట్లాడుతూ రూ.500, 1000 నోట్ల రద్దుతో ఉగ్రవాద సంస్థల వద్ద ఉన్న కరెన్సీ ఏమాత్రం ఉపయోగపడకుండా పోతుంద న్నారు.



 జనవరి నుంచి నూతన సిలబస్

 సీఏ కోర్సు చదివే విద్యార్థులకు జనవరి నుంచి కొత్త సిలబస్ అమలవుతుందని దేవరాజారెడ్డి అన్నారు. నూతన సిలబస్‌ను కార్పొరేట్ ఫైనాన్‌‌స మంత్రిత్వశాఖ ఆమోదం కోసం పంపామన్నారు. భవిష్యత్‌లో సీఏ సిలబస్ కఠినతరంగా ఉంటుందన్నారు. ఎస్‌ఐఆర్‌సీ చైర్మన్ ఫల్గుణకుమార్ మాట్లాడుతూ నగదురహితం వల్ల నల్లధనం బయటకు వస్తుందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top