సెలవుల్లోనూ భోజనం

సెలవుల్లోనూ భోజనం - Sakshi


 ఇన్ బాక్స్



 ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవి సెలవులలో కూడా కొనసాగిస్తే బాగుంటుంది. ఈ పథకం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోని నిరుపేద విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఒక పూట సంపూర్ణ ఆహారం అందుతుంది. కానీ వేసవి, దసరా, సంక్రాంతి సెలవులలో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో నిరుపేద విద్యా ర్థులు పస్తులుండాల్సి వస్తుంది. కావున ప్రభుత్వం మానవతా దృక్ప థంతో సెలవు దినాలలో కూడా మధ్యాహ్న భోజనం అందించాలి. సెలవు దినాలలో కూడా మధ్యాహ్న భోజనం చేయడానికి ఆసక్తి కలిగిన విద్యార్థుల వివరాలు సేకరించి, వారికి ఆహారం అందించే విధంగా చూడాలి. సెలవుదినాల్లో ఈ పథకం అమలుకు ఆయా ప్రాంతాలలోని విద్యావంతులను తాత్కాలిక పద్ధతిలో నియమించి, వారికి గౌరవ వేతనం ఇవ్వాలి. ఒకవేళ ఉపాధ్యాయులకు సెలవుల్లో కూడా ఈ పథకం అమలు బాధ్యత ఇవ్వాలనుకుంటే సంఘాలతో చర్చించి వారికి సంపాదిత సెలవులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. సెలవుల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా నిరుపేద విద్యార్థులకు ఒకపూట సంపూర్ణ ఆహారం అందడంతో పాటు, పౌష్టికాహారం లభించి చురుకుగా తయారవుతారు.

 బి. ప్రేమ్‌లాల్  వినాయక్‌నగర్, నిజామాబాద్



 రైళ్లలో భద్రత డొల్లేనా?

 చట్ట సభల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టినపుడు మాత్రమే మహిళల భద్రత గురించి ప్రస్తావిస్తారు, మళ్లీ మామూలే! రోజూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రైలులో ప్రయాణికులు ముఖ్యం గా  మహిళా ప్రయాణికులు తమ విలువైన బంగారు నగలు పోగొట్టుకోవడమే కాకుండా, గాయాలపాలైన సంఘటనలు జరుగుతూనే ఉండటం శోచనీయం. నిన్నటికి నిన్న నెల్లూరు శివార్లలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన సంఘటన, మొన్న 10 రోజుల క్రితం మరో మహిళా ప్రయాణికు రాలి బ్యాగ్‌లో నగలు మాయమవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు? కానీ ఇంతవరకూ ఏ ఒక్క కేసు కొలిక్కి రాకపోవ డం మన రైల్వే శాఖ పనితీరుకు అద్దం పడు తున్నది. ఇలా దొంగతనం జరిగినప్పుడు మాత్రం హడావుడి చేయడం పరిపాటైపోయింది. మహిళలకు మాత్రమే కేటా యించిన బోగీల్లో పురుషులు ప్రవేశిస్తున్నా పట్టించుకోరు. ఖాళీ బోగీలలో ప్రయాణిస్తున్నప్పుడు మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు, నిఘా పెట్టడం గురించి ఏ ఒక్కరూ ఆలోచిం చరు. ఇప్పటికైనా రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 ఉమా రాజిరెడ్డి  వివేక్‌నగర్, హైదరాబాద్

 

 నిర్భాగ్య నగరం!

 నగరంలో పెట్రోలింగ్ పెంచినా అంతంత మాత్రమే! కీలక ప్రాంతాలకే అది పరి మితం. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు నగర ప్రజలను భయాందోళ నలకు గురిచేస్తున్నాయి. బయటకు వెళ్లిన వాళ్లు ఇంటికి వచ్చేవరకూ నమ్మకం లేదు. ఎక్కడా భద్రత లేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బిక్కు బిక్కు మం టూ గడపవలసిన పరిస్థితి దాపురించింది. అత్యంత భద్రత గల నగరంగా తీర్చి దిద్దుతామని గొప్పలు చెప్పిన మన సర్కారు చేతలలో మాత్రం చతికిలపడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పెట్రోలింగ్ వాహనాలు కేవలం వీఐపీలు నివసించే ప్రాంతాలకే పరిమితమవడం శోచనీయం. నిన్న ఐఏఎస్‌ల నివాస ప్రాం తంలో యువతి దహనం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాక్షాత్తు హోంమంత్రి విచారం వెలిబుచ్చడం ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు! అలాగే బేగంపేటలో ఒక చాయ్ ఆలస్యమైనందుకు హత్య జరగడం నగర ప్రజలను భయాందోళన లకు గురిచేస్తోంది. మనిషి ప్రాణం తీయటమంటే ఏదో చీమనో దోమనో చంపి నంత తేలికగా మారిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నేరగాళ్లు రెచ్చి పోతూనే ఉన్నారు. ఇంక నగర శివారు ప్రాంతాలలో గస్తీ అంతంత మాత్రమే. హత్యలు, గొడవలు ఆగటం లేదు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు శివారు ప్రాంతా లలో గస్తీ పెంచాలి. ఇప్పుడు ఈ కొత్త పోలీసింగ్ వాహనాలు తెల్లవారు జామున ఎక్కువగా, హోటళ్ల ముందు, చాయి తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటిైకైనా పోలీసులు, అన్ని ప్రాంతాలలోనూ గస్తీ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 శొంఠి విశ్వనాథం  చిక్కడపల్లి, హైదరాబాద్



పోలవరం ప్రాజెక్టు

 గోదావరిపై పోలవరం ప్రాజెక్టు గురించి గత 30 ఏళ్లుగా చర్చలు జరు గుతూనే ఉన్నాయి. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టేంతవరకు దీనిపై నిర్దిష్ట చర్యలు తీసుకోలేక పోయారు. రాయలసీమ జిల్లాలకు కూడా నీరందేలా పోలవరంని కృష్ణానదితో అనుసంధానిస్తానని వైఎస్ అధికారంలోకి వచ్చాక వాగ్దా నం చేశారు. అధికారంలో ఉండగా దీని గురించి ఎన్నడూ ఆలోచించని చంద్రబాబునాయుడు నిధులు ఎక్కడినుంచి వస్తాయంటూ అవహేళన చేశారు. పైగా ఈ ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లు మాత్రమే లాభపడుతారని ప్రకటించారు. ఇదే వ్యక్తి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఇంకా ఆచరణ రూపం దాల్చకముందే దాని సమీపంలో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆగమేఘాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు. సాగునీటి ప్రాజె క్టుల గురించి ఏనాడూ ఆలోచించని చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు కోసం ఇంతగా అంగలార్చడం... ఒక్క కాంట్రాక్టర్లను మినహాయిస్తే మిగతా అందరినీ గాభరాపెడుతోంది. ఎందుకంటే పట్టిసీమ ప్రాజె క్టును అధిక అంచనాలతో కాంట్రాక్టర్లకు దఖలు పరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని కేంద్ర ప్రాజెక్టుగా స్వీకరిస్తున్న తరుణంలో పోలవరం మినీ ప్రాజెక్టుగా పట్టిసీమను చేపట్టి ధనం దుబారా చేయడ మెందుకు? పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో అనుసరిస్తున్న ఈ తొందర పాటు చర్యలు ఏమాత్రం సమర్థనీయం కావు.

 కె.ఎమ్. లక్ష్మణరావు  విశాఖపట్నం



 ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల ఉద్యోగాలేవీ?

 ఆంధ్రప్రదేశ్‌లో యువత ఉద్యోగాల కోసం వేయికళ్లతో ఎదురుచూ స్తోంది. ఉద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఏమా త్రం కృషి చేయడం లేదు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యో గరహిత రాష్ర్టంగా మారుస్తామన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచింది. అయితే ఇంతవరకూ ఏ ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయ లేదు. ప్రస్తుతం రాష్ర్టంలోని వివిధ శాఖల్లో ఖాళీలు లక్షలాదిగా ఉన్నా యి. ఇప్పటివరకూ డీఎస్సీ మినహా ఏ ఒక్క నోటిఫి కేషన్ వెలువడలేదు. దీంతో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన నిరుద్యోగులు, ఉద్యోగ అర్హతకు వయోపరిమితి మించి పోతుండటంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతు న్నారు. ఇటీవల పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.   ప్రభు త్వం వెంటనే స్పందించి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేస్తే నిరుద్యోగం కొంతవ రకైనా తగ్గుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యోగ రహిత రాష్ర్టంగా మారుస్తామన్న సర్కారు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగుల కష్టనష్టాలు తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఏలికలపైనే ఉంది.

 బట్టా రామకృష్ణ దేవాంగ  సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా



 ప్రతిపక్షాల గోడు పట్టించుకోరా?

 అసలు ప్రతిపక్షం వద్దా? పాలక పక్షం ఉంటే సరా అనిపిస్తోంది మన సభాపర్వం!. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయటం ఎంతవరకు సమంజసం? ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పాలక పక్షం గమనించాలి! మీడియాను కూడా పాలక పక్షం వైపే చూపెట్టి నిజానిజాలను నిర్వీర్యం చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే చెల్లింది. సభలో పాలక పక్షం సభ్యుడు బొండా ఉమా చేసిన అనుచిత వ్యాఖ్యలతో ప్రజలకు ఔరా ఇది శాసన సభేనా? అనిపించింది. ఏవైనా విభేదాలు ఉంటే పరస్పరం సామరస్యంగా చర్చించుకోవాలి గానీ ఇదేమి తీరు? ఏది ఏమైనా పాలక పక్షం ఆగడాలు మితి మీరిపోయాయనడానికి అసెంబ్లీలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. సభలో వైకాపా అడిగిన ప్రశ్నలకు జవాబులు లేక ఇలాంటి ఆరోపణలు చేసి సభను తప్పు తోవపట్టించిన ఘనత పాలక పక్షానిదే అని పలువురు విమర్శి స్తున్నా ఇంకా ముఖ్యమంత్రి అదే తీరుతో వ్యవహరించడం బాధాకరం. ఇప్పుడు అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కాదు... రేపు ప్రతిపక్షంలో కూర్చునే సమయం కూడా వస్తుందని అధి కార పార్టీ వాళ్లు గమనించాలి. కనుక ఇప్పటికైనా అధికార పక్షం సభలో హుందాగా వ్యవహరించాలి. లేదంటే ప్రజలే బుద్ధి చెప్పే రోజు త్వర లోనే వస్తుంది.

 శిష్ట్లా మురళీసుధాకర్  చందానగర్, హైదరాబాద్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top