ఇంటర్‌లో తగ్గిన ఉత్తీర్ణత


- ఫలితాల్లో వెనుకబడిన తేగాడ ఆదర్శ, తాళ్లపాలెం గురుకులం

- పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేక అవస్థలు

- నిరాశ వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

కశింకోట:
మండలంలోని ప్రభుత్వ ఆదర్శ, గురుకుల పాఠశాలలు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. వీటిలో కనీసం యాభై ఉత్తీర్ణత లభింలేదు. ఇక్కడ నిర్వహిస్తున్న ఆంగ్ల మాద్యమం కోర్సులకు సంబంధించి అవసరమైన అధ్యాపకులు లేకపోవడమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. మండలంలో తేగాడలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలో నాలుగు గ్రూపులతో ఇంటర్మీడియెట్ నిర్వహిస్తున్నారు.



ఇదే పాఠశాల నుంచి ఈ ఏడాఇ 57 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, 26 మంది మాత్రమే పాసయ్యారు. 46 శాతం ఉత్తీర్ణత లభించింది.  బైపీసీలో 14 మందికి ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక సీఈసీ గ్రూపులో ఉత్తీర్ణత దారుణం. 17 మందికి ఇద్దరు మత్రమే పాసయ్యారు. ఎంఈసీ గ్రూపులో కూడా 8 మందికి ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపులో పెదపాటి జానకి 389 మార్కులు, మంత్రి సాయికుమార్‌కు  369 మార్కులు రావడం అక్కడి ప్రమాణాలకు అద్దం పడుతున్నాయి. ఇక్కడ కెమిస్ట్రీ అధ్యాపకుడు లేకపోవడం, తెలుగు మాధ్యమంలో మొదటి నుంచి చదివి వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమంలో మారి పరీక్షలు రాయడం తదితర కారణాల వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.



గురుకుల పాఠశాలలోనూ...

మండలంలోని తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలోని ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా ఆశాజనకంగా లేవు. ఈ ఏడాది సుమారు 40 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ ఎంఈసీ, సీఈసీ గ్రూపులను ఈ విద్యా సంవత్సరంలోనే ఆంగ్ల మాధ్యమం కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆంగ్లం, ఎకనామిక్స్ సబ్జెక్టులకు తప్ప మిగిలిన సబ్జెక్టులకు కాంట్రాక్టు ఉపాధ్యాయులతో నెట్టుకొచ్చారు. దీంతోపాటు విద్యార్థులు ఎక్కువ మంది  తెలుగు మాధ్యమం నుంచి వ చ్చిన వారు కావడం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ  పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ సిబ్బందిని నియమించి విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top