వాట్సాప్‌ ఫొటో పోలీసులకు పట్టించింది


హైదరాబాద్ : అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్న నిందితుడిని హైదరాబాద్ పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని లక్ష్మీనర్సింహ నగర్‌లో నివసించే గొంటి మహేష్ యాదవ్ అలియాస్ చంటియాదవ్(22) ఇటీవల ఓ వివాహ వేడుక బారాత్‌లో తల్వార్ తిప్పుతూ నృత్యం చేసి, ఆ ఫొటోను వాట్సాప్‌లో పోస్టు చేశాడు.  ఆ ఫొటో టాస్క్‌ఫోర్స్ పోలీసుల కంటపడింది. కాగా శుక్రవారం రాత్రి ఎల్‌ఎన్ నగర్‌లో సాయి మినర్వా అపార్ట్‌మెంట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న చంటి యాదవ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెబుతున్న అతడ్ని విచారించి సోదాలు చేయగా తల్వార్ లభించింది.  తల్వార్ను స్వాధీనం చేసుకుని, అతడిపై కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top