ఆన్‌లైన్ అడ్మిషన్లు..విద్యార్థులకు శాపం

ఆన్‌లైన్ అడ్మిషన్లు..విద్యార్థులకు శాపం - Sakshi


టీటీడీ విద్యాసంస్థల్లో  ప్రవేశానికి ఈ ఏడాది నుంచి  ప్రవేశపెట్టిన ఆన్‌లైన్  విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రతిభ ఉన్నా, ఎక్కువ మార్కులు సాధించినా కళాశాలలో సీటు పొందలేక పోతున్నారు.



- ప్రతిభ ఉన్నా టీటీడీ విద్యాసంస్థల్లో దక్కని సీట్లు

- అత్తెసరు మార్కులు పొందినవారికి రాచ మార్గం    

యూనివర్సిటీక్యాంపస్:
చిత్తూరుకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్‌లో 98 శాతం మార్కులు సాధించాడు. టీటీడీ విద్యాసంస్థల్లో డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేశాడు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించినందువల్ల తనకు సీటు ఖాయం అనుకున్నాడు. అయితే టీటీడీ ప్రకటించిన మెరిట్‌లిస్టులో అతనిపేరు లేదు. అతని కన్నా తక్కువ మార్కులు వచ్చిన, 50 శాతం మార్కులు సాధించిన వారికి సీట్లు వచ్చాయి. తనకు మాత్రం రాలేదు. సీటు ఎందుకు రాలేదని సంబంధిత కళాశాలకు వెళితే అంతా ఆన్‌లైన్ తప్పిదమే..తప్ప తమది కాదని  తప్పించుకుంటున్నారు. జాబితాలో సదరు అభ్యర్థి దరఖాస్తు కూడా లేకపోవడంతో సీటు రాక నిరాశకు గురయ్యాడు. ఇదీ టీటీడీ  విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.

 

టీటీడీ విద్యాసంస్థల్లో అత్తెసరు మార్కులు పొందినవారు రాచ మార్గంలో సీట్లు పొందుతున్నారు. దీంతో వారు తీవ్ర నిరాశ, నిస్పృహలకు  గురవుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల సీటు పొందని వారికి రెండో విడతలో అడ్మిషన్ ఇస్తామంటున్నారు. తీరా చూస్తే వారి దరఖాస్తులు  కనిపించడంలేదు. దీంతో ఆ విద్యార్థులు  బోరున విలపిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ విధానం అమలు కోసం టీటీడీ రూ.20 లక్షల వ్యయం చేసి,  ఓ సాఫ్ట్‌వేర్  సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

 

అయితే అడ్మిషన్ల వ్యవహారంపై ఈ సంస్థ ముందస్తు చర్యలు తీసుకోలేదు. అలాగే సాంకేతిక సమస్యలు తలెత్తితే సరి చేసేందుకు, ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రతినిధిని నియమించలేదు. దీంతో తప్పులు దొర్లి విద్యార్థులు నష్టపోతున్నారు.  

 

22 తర్వాత దరఖాస్తులు పరిశీలించిన అధికారులు

టీటీడీ ఆన్‌లైన్ విధానం ప్రకారం గత జూన్ మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ   పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో వేడుకగా అభిషేకం జరిపారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయ దేవేర్లతో కలిసి స్వామివారు ఊంజల్‌పై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని వేంచేపుగా ఆలయం నుంచి వాహన మండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన హనుమంత వాహనంపై కొలువుదీర్చారు.  పట్టుపీతాంబరాలు, వజ్ర వైఢూర్య ఆభరణాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు.



తదుపరి సర్వాంగ సుందరంగా అలంకృతుడైన స్వామివారు హనుమంతునిపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా తిరువీధుల్లో భక్తులు స్వామి వారికి కర్పూర హారతులు సమర్పించారు. కార్యక్రమాల్లో  ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు రవి, వరప్రసాద్, ఆర్జితం, ప్రసాదం ఇన్‌స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.

 

నేడు గరుడ సేవ..

అవతారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి 7.15గంటలకు సుందరరాజస్వామివారు గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.  అలాగే మధ్యాహ్నం 2గంటలకు అభిషేకం, సాయంత్రం 5.30గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top