పట్టాలు, పాస్‌పుస్తకాలు ఉంటే పరిహారం ఓకే


- సాగులో ఉండేవాటిపై చర్చించి నిర్ణయిస్తాం : ఆర్టీవో

- ఎకరాకు రూ.10లక్షలు ఇవ్వాలని రైతుల డిమాండ్

శ్రీకాళహస్తి:
రైతులకు పాస్‌పుస్తకాలు...పట్టాలు ఉంటే పరిహారం ఓకే.... ఇవే వీ లేకుండా రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పరిహారం ఇచ్చే విషయం పై మాత్రం చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మం అన్నారు. శ్రీకాళహస్తి మండలంలో భూ ముల సేకరణపై శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్టీవో వీరబ్రహ్మంతో పాటు తహశీల్దార్ చంద్రమోహన్ రైతులతో రెండోసారి  సమావేశం నిర్వహిం చారు. రైతులు తమకు ఉన్న కొద్దిపాటి భూములు ఇచ్చేస్తే ఎలా బతకాలి అం టూ ఆవేదన వ్యక్తం చేశారు.



దీంతో ఆర్డీవో వీరబ్రహ్మం మాట్లాడతూ గతం లో శ్రీసిటీ ఏర్పాటుకు రైతుల నుంచి భూములను ఉచితంగా సేకరించారు, ఇప్పుడు భూములకు డబ్బులు ఇస్తామని చెప్పినా సంకోచిస్తున్నారు ఎందు కు... అంటూ రైతులను ప్రశ్నించారు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు భూముల సేకరణను వ్యతిరేకించడం మాములే అంటూ రైతులకు తెలిపారు. డీకేటీ భూములు తీసుకునే హక్కు తమ కు ఉన్నా...ఆ భూములను అభివృద్ధి చేశారని ఉద్దేశంతో పరిహారం ఇస్తున్న ట్లు చెప్పారు.



దీంతో రైతులు ఏర్పేడు మండలంలోని జంగాలపల్లి రైతులకు ప రిహారం ఇచ్చినట్టే తమకు ఇవ్వాలని కో రారు. ఏర్పేడు మండలంలో కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలు ఏర్పాటు చే స్తుండడంతో వారే పరిహారం ఇస్తారని...శ్రీకాళహస్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉం టుందని, ఏర్పేడు స్థాయిలో శ్రీకాళహస్తి మండలంలో పరిహారం చెల్లించడం కుదరదని తేల్చిచెప్పారు. పాస్‌పుస్తకాలు,పట్టాలు ఉన్నవారికి పరిహారం ఇస్తారని, ఇవిలేకుండా భూమిని సాగుచేసుకుంటున్న వారికి పరిహారం విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలి పారు.



భూములున్న పలువురు రైతుల నుంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకుంటున్నామని, అయితే వారందరికీ పరిహారం ఇస్తున్నట్లు కాదని...ఆ భూ ములపై సమగ్ర విచారణచేసిన తర్వాత వారు అర్హులైతేనే పరిహారం వస్తుందని తెలిపారు. రైతులు భూములు ఇవ్వకపోతే ఫ్యాక్టరీలు బెంగ ళూరు,చెన్నై,హైదరాబాద్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే రైతులు చివరగా ఎకరానికి రూ.10లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని, లేదంటే సెంటు భూమి ఇచ్చే ది లేద నిచెప్పారు. దీంతో ఆర్డీవో మరోసమావేశంలో పరిహారంపై చర్చలు జరిపి స్పష్టం చేస్తామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top