బీఆర్ అంబేద్కర్ వర్సిటీలో హెల్త్‌కేర్ కోర్సు


హైదరాబాద్ : బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో ఎంబీఏ(హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) కోర్సులో 2015-16 సంవత్సరానికిగాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. రెండేళ్ల కాల వ్యవధి గల ఈ కోర్సు క్యాంపస్‌లో పూర్తి స్థాయి తరగతులతో జరుగుతుందని, ఇంగ్లీష్ మీడియంలో ఉండే ఈ కోర్సుకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు. డిగ్రీ చదివిన విద్యార్థులు కోర్సులో చేరడానికి అర్హులని, ఇందుకోసం జూన్ 13వ తేదీన అపోలో హెల్త్‌ సిటీలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 040-23556850 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top