శ్రీకాకుళంలో భారీ వర్షాలు
శ్రీకాకుళం: అల్ప పీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కుంటలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.