ఆదోనిలో భారీ అగ్నిప్రమాదం


ఆదోని(కర్నూలు జిల్లా): ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన సోమవారం రాత్రి ఆదోని పట్టణంలోని ఎన్జీవో కాలనీలో జరిగింది. వివరాలు..ఎన్జీవో కాలనీలోని ఒక దుకాణంలో సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్క సారిగా ఎగిసిపడిన మంటలు పలు దుకాణాలకు అంటుకున్నాయి. దీంతో స్థానికులు భయాంధోళనలకు గురయ్యారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమి జరగలేదని సమాచారం. దుకాణాలన్నీ మూసి ఉండటంతో ఆస్తి నష్టం అంచనా వేయలేకపోతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top