రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నేత మృతి

రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నేత మృతి - Sakshi


తమ్మిడేపల్లి (సోమందేపల్లి): కోర్టు పనిపై వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై వైఎస్సార్ సీపీ నేత మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అమరాపురం మండలం తమ్మిడేపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ నేత హనుమంతరాయుడు(54) గ్రామంలో రేషన్ డీలర్ గా వ్యవహరిస్తున్నారు.



టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హనుమంతరాయుడు డీలర్ షిప్‌ను తొలగించారు. దీనిపై పెనుగొండ ఆర్డీవో కోర్టుకు శనివారం బయలుదేరారు. ఉదయాన్నే హిందుపురం వచ్చి,పని  పూర్తి చేసుకుని పెనుగొండ వస్తున్నారు. వాహనం మండల పరిధిలోని గుడ్డంనాగేపల్లి దాటి వస్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న నీలగిరి చె ట్ల మధ్యలోకి పోయి కిందకు పడ్డాడు. తలకు బలమైన గాయం అరుు్యంది.  చేనులో ఉన్న కొందరు పరిగెత్తుకొంటూ వచ్చి అతనికి నీళ్లు తాగించి 108కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే సరికి మృతి చెందా డు. మృతుని ఫోన్‌ద్వారా బంధువులు, స్నేహితులకు సమాచారం ఇచ్చారు.



సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ రఫీక్ ఘటనా స్థలానికి చేరుకుని శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈతనికి భార్య, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ఉన్న ఒక్క కొడుకు రాఘవేంద్ర కూడా గత సంవత్సరం కర్ణాటక ప్రాంతం లోని పరుశారంపురంలో ద్విచక్రవాహనంలో వెలుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కరువైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top